నట సింహం బాలకృష్ణ – డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో బ్లాక్ బస్టర్ అఖండ కు సీక్వెల్ గా వస్తున్న చిత్రం అఖండ 2 .షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. డిసెంబర్ 5న థియేటర్లలోకి రానుంది.ఈసినిమా నుండి ఇంతకుముందు వచ్చిన టీజర్ అలాగే రెండు పాటలు సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈరోజు కీలకమైన ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. డ్యూయెల్ రోల్ లో బాలకృష్ణ అదరగొట్టాడు.తమన్ బీజీఎమ్ ,విజువల్స్ ట్రైలర్ లో హైలైట్ అయ్యాయి. ఓవరాల్ గా బోయపాటి శ్రీను మార్క్ యాక్షన్ ప్యాక్డ్ గా వచ్చిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంది.
అఖండ 2 లో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించగా హర్షాలి మల్హోత్రా కీలక పాత్రలో నటించింది. ఆది పినిశెట్టి విలన్ గా కనిపించనున్నాడు.భారీ బడ్జెట్ తో 14 రీల్స్ ప్లస్ నిర్మిస్తుంది. పాన్ ఇండియా భాషల్లో అఖండ 2 భారీ స్థాయిలో విడుదలకానుంది. విడుదలకు ఒక్క రోజు ముందు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























