పెద్ది ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్

Peddhi First Single Promo Released

మెగా  పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చి బాబు సాన కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా పెద్ది. రూరల్ బ్యాక్  డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా వున్నాయి. ఇక పెద్ది ఫస్ట్ సాంగ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న  విషయం తెలిసిందే.ఇక వారి ఎదురుచూపులకు తెర పడనుంది. ఈనెల 7న ఈ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు.అందులో భాగంగా ఈరోజు సాంగ్ అనౌన్స్ మెంట్  వీడియోను రిలీజ్ చేశారు.ఈ వీడియో చివర్లో సాంగ్ ప్రోమో కూడా యాడ్ చేశారు.చికిరి చికిరి అంటూ వచ్చిన ఇక ఈ ప్రోమో.. సాంగ్ పై అంచనాలను భారీగా పెంచేసింది.ఇందులో చరణ్ డ్యాన్స్ స్టెప్ అదిరిపోయింది. ప్రముఖ బాలీవుడ్ సింగర్ మసకలీ ఫేమ్ మోహన్ చౌహన్ చేత ఈసాంగ్ పాడించారు.ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.ఈ సాంగ్ యూట్యూబ్ లో రికార్డులు సృష్టిచడం ఖాయం.వీడియోలో చికిరి అర్ధం కూడా చెప్పాడు బుచ్చి బాబు. 

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక పెద్ది షూటింగ్ విషయానికి వస్తే రీసెంట్ గానే శ్రీలంక షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. దాంతో 70 శాతం షూట్ పూర్తయింది.పెద్దిలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్,జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు.మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ ప్రతినాయకుడిగా చేస్తున్నాడు.తెలుగులో తనకు ఇదే మొదటి సినిమా.

మైత్రి మూవీ మేకర్స్,వృద్ధి సినిమాస్ ,సుకుమార్ రైటింగ్స్ ఈసినిమాను నిర్మిస్తున్నాయి.డిసెంబర్ లోగా షూట్ కంప్లీట్ చేసి వచ్చే ఏడాది 27న సినిమాను రిలీజ్ చేయనున్నారు.అయితే ముందు రోజు శ్రీరామ నవమి కావడంతో 26నే రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

ఇక ఈసినిమా తరువాత రామ్ చరణ్ , సుకుమార్ డైరెక్షన్ లో సినిమా చేయనున్నాడు. ఇంతకుముందు వీరి కాంబో లో వచ్చిన రంగస్థలం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వడంతో రెండో సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ , సుకుమార్ రైటింగ్స్ ఈసినిమాను నిర్మించనున్నాయి. ప్రస్తుతం స్క్రిప్ట్ పూర్తి చేసే పనిలో వున్నాడు సుకుమార్.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.