ప్రియదర్శి, నిహారిక ఎన్‌ఎమ్ ప్రధాన పాత్రల్లో నటించిన కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రం మిత్ర మండలి దీపావళికి సందర్భంగా థియేటర్లలోకి వచ్చింది. మంచి అంచనాల మధ్య వచ్చిన ఈసినిమా అనుకున్న విజయాన్ని సాధించలేకపోయింది.ఇక ఈసినిమా థియేటర్లలో విడుదలైన 21 రోజులకే ఓటీటీలోకి రానుంది . ఈ చిత్రం రేపటి నుండి ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సంధర్భంగా ప్రియదర్శి ట్వీట్ చేశాడు.ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌పై ప్రకటన చేస్తూ.. సినిమాను రీకట్ చేశామని, ప్రేక్షకులు మిత్ర మండలి కొత్త వెర్షన్‌ను చూడబోతున్నారని తెలిపారు.ఈసారి మరింత సరదాగా, డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు.థియేటర్లలో చూడలేని ప్రేక్షకులు ఈ కొత్త వెర్షన్‌ను నవంబర్ 6 నుండి ప్రైమ్ వీడియోలో వీక్షించవచ్చు.
దర్శకుడు విజయేందర్ ఎస్ తెరకెక్కించిన ఈ సినిమా లో వెన్నెల కిషోర్, సత్య, విష్ణు ఓయ్, రాగ్ మయూర్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాను వైరా ఎంటెర్టైమెంట్స్ బ్యానర్ పై విజేందర్ రెడ్డి నిర్మించగా బన్నీ వాసు సమర్పించారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























