ఉప్పెన తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు బుచ్చి బాబు సాన తన రెండో సినిమాను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో చేస్తున్న సంగతి తెలిసిందే.వీరి ఇద్దరి కాంబినేషన్ రూరల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న సినిమా పెద్ది. రీసెంట్ గా పూణే షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ఈసినిమా ఫస్ట్ సింగిల్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇక డైరెక్టర్ బుచ్చి బాబు ఈసినిమా అప్డేట్స్ ఇచ్చాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పెద్ది 60శాతం షూట్ కంప్లీట్ చేసుకుంది. ఫస్ట్ సాంగ్ ను నవంబర్ మొదటి లేదా రెండో వారం లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. ఏఆర్ రెహమాన్ గారు అదిరిపోయే సాంగ్ ఇచ్చారు. సినిమా మార్చి 27న రిలీజ్ చేస్తాం, అయితే ముందు రోజు శ్రీరామనవమి కాబట్టి ఆ రోజు రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తామని బుచ్చి బాబు మీడియాతో వెల్లడించాడు.
పెద్దిలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్,జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ ప్రతినాయకుడిగా చేస్తున్నాడు.తెలుగులో తనకు ఇదే మొదటి సినిమా.లెజండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్,వృద్ధి సినిమాస్ ,సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తున్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























