సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని మోషన్ పోస్టర్ రిలీజ్

sampradayini suppini suddapoosani motion poster released

శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ పై రెండవ ప్రాజెక్టుగా సుధీర్ శ్రీరామ్ రచన దర్శకత్వంలో నటుడు శివాజీ, లయ జంటగా నటిస్తూ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా మరోసారి ఈటీవీ విన్ తో కలిసి శివాజీ పనిచేస్తున్నారు. 90’s వెబ్ సిరీస్ లో శివాజీతో కలిసి నటించిన బాల నటుడు రోహన్, అలీ, ధనరాజ్, రఘుబాబు, 30 ఇయర్స్ పృధ్వీ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా మేకర్స్ ఈ సినిమా టైటిల్ రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి సాంప్రదాయని సుప్పిని సుద్దపూసని అనే ఆసక్తికరమైన టైటిల్ పెట్టారు. 90 వెబ్ సిరీస్‌లో శివాజీ, రోహన్ మధ్య వచ్చే ఈ బీజీఎం వైరల్ అయ్యింది. ఈ టైటిల్ పెట్టడం మరింత ఆసక్తి పెంచింది.

ఈ చిత్రంలో పంచాయతీ సెక్రెటరీ శ్రీరామ్ గా కనిపించనున్నారు. టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ లో శివాజీ, లయ సీరియస్ గా నడుస్తూ ముందుకు వస్తుండగా రోహన్ సెల్ఫీ తీసుకుంటూ కనిపించడం క్యురియాసిటీ పెంచింది.

మేకర్స్ రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ చాలా క్రియేటివ్ గా వుంది.చిత్తూరు బ్యాక్ డ్రాప్ లో జరిగే కథలో ఒక క్రైమ్ ఎలిమెంట్ కూడా వున్నట్లు మోషన్ పోస్టర్ లో చాలా ఎక్సయిటింగ్ గా ప్రజెంట్ చేయడం సినిమాపై ఆసక్తిని పెంచింది.ఈ చిత్రానికి రంజిన్ రాజ్ మ్యూజిక్ అందిస్తున్నారు. కెమెరామెన్ రిత్విక్ రెడ్డి, బాలు మనోజ్.డి ఎడిటర్.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.