నవంబర్ లో రానున్న కాంత

Kaantha Set for November Release

గత ఏడాది తెలుగు సినిమా లక్కీ భాస్కర్ తో వచ్చి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు మలయాళ హీరో దుల్కర్ సల్మాన్.అంతేకాదు ఈ సినిమాతో ఈ హీరో మొదటి సారి 100 కోట్ల క్లబ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు.ఇక దుల్కర్ నెక్స్ట్ కాంత తో రానున్నాడు.తమిళ దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ డైరెక్ట్ చేస్తుండగా మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది.రానా ఈసినిమాకు ఓ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు.1950 బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే ఈసినిమా సెప్టెంబర్ 12న రిలీజ్ కావాల్సివుండగా వాయిదాపడింది.ఇక ఈసినిమా వర్క్ కూడా ఫినిష్ అయ్యిందని సమాచారం.దాంతో రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. నవంబర్ 7 కానీ లేదా 14న రిలీజ్ చేయాలని చూస్తున్నారు.త్వరలోనే ఈ రిలీజ్ డేట్ విషయంలో ఓ క్లారిటీ రానుంది.టీజర్ అయితే ఈసినిమాకు మంచి హైప్ ను తీసుకొచ్చింది. కాంత పాన్ ఇండియా భాషల్లో విడుదలకానుంది.

ఇక దుల్కర్ తెలుగులో వరసగా రెండు విజయాలను అందుకున్న ఈ హీరో ప్రస్తుతం మరో రెండు సినిమాలు చేస్తున్నాడు.అందులో భాగంగా పవన్ సాధినేని డైరెక్షన్ లో దుల్కర్ ఆకాశంలో ఒక తార అనే చేస్తున్నాడు.ఇందులో సాత్విక వీరవల్లి హీరోయిన్ గా నటిస్తుంది.రమ్య గుణ్ణం,సందీప్ గుణ్ణం నిర్మిస్తున్నారు.ఈసినిమాతో పాటు దుల్కర్ లవ్ స్టోరీ నేపథ్యంలో రవి నెలకుడిటి డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు.పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నాడు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.