AA22xA6 మూవీ గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన అట్లీ

Director Atlee Shares Interesting Updates on Allu Arjun's AA22 Project

‘పుష్ప 2’తో ఆల్ టైమ్ హిట్ అందుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ గురించి తాజాగా అట్లీ ఒక కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సినిమా ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే ఒక సరికొత్త ప్రపంచాన్ని సృష్టించనుందని ఆయన ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ మేరకు బెంగళూరులో జరిగిన ఒక ఈవెంట్‌కు అతిథిగా హాజరైన డైరెక్టర్ అట్లీ, అల్లు అర్జున్‌తో తాను చేయబోయే సినిమా (AA22xA6)కి సంబంధించి పలు కీలక విషయాలు మీడియాతో పంచుకున్నారు. ఈ మూవీపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు స్పందించిన ఆయన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వెల్లడించారు.

అట్లీ ఏమన్నారంటే…

  • “ప్రతి గొప్ప సినిమా కేవలం ఒక్క ఆలోచనతోనే ప్రారంభమవుతుంది. అల్లు అర్జున్ గారితో చేయబోయే ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తున్నాం.”
  • “ప్రేక్షకులు ఆశ్చర్యపోయే విధంగా ఒక కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేయబోతున్నాం. ఈ భారీ ప్రాజెక్ట్‌ను రూపొందించడం రిస్క్‌గా నేను భావించడం లేదు, నేను దీన్ని పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నా.”
  • “దేవుడి దయ వల్ల మా ప్రయాణంలో అంతా అనుకున్నట్లుగానే సాగుతోంది. మరికొన్ని నెలల్లో ఈ సినిమాను ప్రేక్షకులు ఖచ్చితంగా ఆస్వాదిస్తారు.”

కాగా, అట్లీ చేసిన ఈ వ్యాఖ్యలతో అల్లు అర్జున్ అభిమానుల్లో, సినీ ప్రేక్షకుల్లో ఈ ‘AA 22’ ప్రాజెక్ట్‌పై అంచనాలు మరింత పెరిగాయి. ఇక ఈ సందర్భంగా దర్శకుడు అట్లీ ‘కాంతార చాప్టర్ 1’ సినిమాపై, హీరో రిషబ్ శెట్టిపై కూడా ప్రశంసలు కురిపించారు. ‘కాంతార 1’ ఒక అద్భుతమని, రిషబ్‌ శెట్టి ఎంతోమందికి స్ఫూర్తి అని కొనియాడారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.