కాంతార చాప్టర్ 1 చిత్రానికి ఘన విజయం అందించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు- రిషబ్ శెట్టి  

Rishab Shetty Thanks Telugu Audience for Kantara Chapter 1’s Grand Success

రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 దసరా కు విడుదలై థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. నిన్నటి వరకు ఈసినిమా  ప్రపంచవ్యాప్తంగా 500 కోట్లకు పైగా  గ్రాస్ కలెక్ట్ చేసి కొత్త బెంచ్ మార్క్ ని క్రియేట్ చేసింది.  ఈ సందర్భంగా హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాంతార: చాప్టర్ 1తో చాలా పెద్ద విజయాన్ని అందుకున్నారు.. కంగ్రాజులేషన్స్.  

థాంక్యూ అండి. తెలుగు ప్రేక్షకులకి హృదయపూర్వక కృతజ్ఞతలు. చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కాంతారకి ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో ఈ సినిమా కూడా అంత గొప్ప రెస్పాన్స్ ఇచ్చారు. నా జర్నీలో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నాను .

ప్రీక్వెల్ ఆలోచన ముందు నుంచే ఉందా?

కాంతార చేసినప్పుడే ఈ ఆలోచన కూడా ఉంది. కాంతారాకి వచ్చిన అద్భుతమైన రెస్పాన్స్ చూసి ప్రీక్వెల్ స్క్రిప్ట్ రాయడం మొదలుపెట్టాం.

కాంతారతో జానపద కథలకు మళ్లీ పునర్వైభవం తీసుకొచ్చారని ప్రశంసలు రావడం ఎలా అనిపించింది?

చాలా ఆనందంగా వుంది. కథని చాలా నిజాయితీగా చెప్పాలనుకున్నాం. అది ప్రేక్షకులకు నచ్చింది. ఇండియా జానపద కథలకు నిలయం. ఈ సినిమా విజయం మరిన్ని జానపద కథలు రావడానికి అవకాశం కల్పించడం చాలా ఆనందంగా ఉంది.నాకు జానపద కథలు చేయడం ఇష్టం. కాంతార మా ప్రాంతంలో జరిగిన కథ. అందుకే లొకేషన్ కూడా మా ప్రాంతంలోనే తీసుకోవడం జరిగింది.కాంతార చాలా కాంప్లికేటెడ్ స్క్రిప్ట్. ఈ సినిమా చేయడం ఒక పెద్ద ఛాలెంజ్ తో కూడుకున్నది. ఈ సినిమా చేస్తున్నప్పుడు ప్రతిరోజు ఒక ఛాలెంజ్ గా ఉండేది.

-కాంతార లాంటి సినిమాకి వరల్డ్ బిల్డింగ్ చేయడం చాలా పెద్ద ప్రాసెస్. కాంతార కోసం మా ప్రాంతంలోనే ఒక ప్రత్యేకమైన స్టూడియో కూడా ఏర్పాటు చేయడం జరిగింది.  చిన్నప్పుడు నుంచి మా ఊర్లో షూటింగ్ చేయాలని కోరిక ఉండేది. మా ఊరు ప్రాంతం వాళ్లు కూడా ఈ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది.

-నా వైఫ్ ఈ సినిమాకి ఇచ్చిన సపోర్టు మర్చిపోలేను. కాస్ట్యూమ్ డిజైనర్ గా తన కాంట్రిబ్యూషన్ మాకు ఎంతగానో హెల్ప్ అయింది.

రుక్మిణి వసంత్ గారి పాత్ర గురించి?

రుక్మిణి గారి ప్రీవియస్ సినిమాలు చూసి సెలెక్ట్ చేశాను. అలాగే గుల్షన్ దేవయ్య ,జయరాం గారి పాత్రలు కూడా అద్భుతమైన ఆదరణ పొందాయి. ప్రతి ఒక్కరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

నటుడు, దర్శుడిగా మీలో ఏ కోణాన్ని ఎక్కువగా ఇష్టపడతారు?

-నా ఫస్ట్ ప్రిఫరెన్స్ డైరెక్షను. నటుడుగా కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటే దర్శకత్వానికి ఇస్తాను.

అజినిష్ మ్యూజిక్ గురించి?

-అజినిష్ సినిమాకి చాలా డిఫరెంట్ గా కంపొజిషన్ చేశారు.  ట్రైబల్ ఏరియాస్ కి వెళ్లి అక్కడ ఒరిజినల్ స్కోర్ ని రికార్డ్ చేశారు.ఆయన కాంట్రిబ్యూషన్ మర్చిపోలేనిది.

 ఎన్టీఆర్ గారితో మీ అనుబంధం గురించి?

-ఎన్టీఆర్ గారు నాకు సోదరుడు లాంటివారు. ఆయన చాలా గొప్ప సపోర్ట్ ఇచ్చారు. ఆయన సపోర్టుకి జీవితాంతం రుణపడి ఉంటాను.

హోంబలే ఫిల్మ్స్ గురించి ?

– హోంబలే ఫిల్మ్స్ ఈ సినిమాకి ఇచ్చిన సపోర్టు మామూలుది కాదు. కేవలం నిర్మాతలుగా కాదు పర్సనల్ గా మోరల్ గా కూడా సపోర్ట్ ఇచ్చారు. వారి సపోర్ట్ తోనే సినిమా ఇంత అద్భుతంగా వచ్చింది.

ప్రస్తుతం చేస్తున సినిమాలు ?

ప్రస్తుతం జై హనుమాన్ చేస్తున్నాను. ఇంకొన్ని ఐడియాస్ ఉన్నాయి. అయితే వాటికి ఇంకా సమయం పడుతుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.