అఫిషియల్ : ఫంకీలో కయదు లోహర్

Kayadu Lohar confirmed as the female lead in Funky

యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం జాతిరత్నాలు ఫేమ్ అనిరుధ్ దర్శకత్వంలో ఫంకీ అనే సినిమాలో నటిస్తున్నాడు. సినిమా ఇండస్ట్రీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ చిత్రంలో విశ్వక్ సేన్ డైరెక్టర్‌గా కనిపించనున్నాడు.ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా డ్రాగన్ బ్యూటీ కయదు లోహర్ నటిస్తుందని ఇటీవల రివీల్ అవ్వగా తాజాగా మేకర్స్ ఈరోజు అఫిషియల్ గా ప్రకటించారు.ఇందులో ఆమె పాత్ర చాలా ఎనర్జిటిక్‌గా ఉంటుందని సమాచారం.ఇప్పటికే చిత్రీకరణ దాదాపు పూర్తయింది.త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుకానున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమాకి సంబంధించిన టీజర్ అక్టోబర్ 10న రిలీజ్ కానుంది.అనుదీప్ నుండి వస్తున్న సినిమా కావడంతో ఫంకీ పై అంచనాలు వున్నాయి.భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీకర స్టూడియోస్,ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఇక ఇటీవల వరుస పరాజయాలతో ఉన్న విశ్వక్ సేన్‌కు ఫంకీ చాలా కీలకమైన సినిమా కానుంది.ఈ సినిమాతో తను మళ్లీ ఫామ్‌లోకి రావాలని చూస్తున్నాడు.ఫంకీ ని వచ్చే ఏడాది ఫిబ్రవరి లో విడుదలచేయాలని చూస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.