ప్రైమ్ లోకి వచ్చేసిన జూనియర్ 

Junior Arrives on Prime Video

కన్నడ హీరో కిరీటి రెడ్డి , హీరోయిన్ శ్రీలీల జంటగా నటించిన చిత్రం జూనియర్. జులై లో థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా పర్వాలేదనిపించుకుంది.కిరీటి కి ఇదే మొదటి సినిమా.ఇందులో తన నటనకు అలాగే ఫైట్స్ ,డ్యాన్స్ కు మంచి పేరొచ్చింది.ఇక థియేటర్లలో విడుదలైన దాదాపు రెండు నెలల తరువాత జూనియర్ ఓటీటీలోకి వచ్చేసింది.అమెజాన్ ప్రైమ్ జూనియర్ తెలుగు వెర్షన్ ను ఈరోజు నుండి స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రాధా కృష్ణ రెడ్డి తెరకెక్కించిన ఈసినిమాలో జెనీలియా డిసౌజా, వి. రవిచంద్రన్ కీలక పాత్రల్లో నటించగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.ఇందులో వైరల్ వయ్యారి సాంగ్ సెన్సేషనల్ హిట్ అనిపించుకుంది.వారాహి చలన చిత్రం బ్యానర్ పై రజినీ కొర్రపాటి ఈసినిమాను నిర్మించారు.

జూనియర్ కథ : అభినవ్ (కిరీటి రెడ్డి), తన తండ్రి కోదండపాణి (వి. రవిచంద్రన్) అతి ప్రేమతో విసిగిపోయి,స్వేచ్ఛ కోసం కాలేజీలో చేరతాడు. అక్కడ అతను స్పూర్తి (శ్రీలీల) తో ప్రేమలో పడతాడు.మరింత స్వేచ్ఛగా ఉండటానికి, అభినవ్ ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇంటర్న్‌షిప్‌కు వెళ్తాడు, అక్కడ ఆ కంపెనీ సీఈఓ విజయా సౌజన్య (జెనీలియా) తో గొడవ పడతాడు.అయితే కంపెనీలో జరుగుతున్న ఒక కార్పొరేట్ స్కామ్‌ను పరిశోధించే క్రమంలో, అభినవ్‌కు విజయ సౌజన్య గురించి ఒక పెద్ద నిజం తెలుస్తుంది.ఇంతకీ ఏంటి ఆ నిజం. విజయ సౌజన్య, అభినవ్ కు ఏమవుతుంది? తండ్రి కోదండపాణి పై ఆమె ఎందుకు ద్వేషం పెంచుకుంటుంది.మరి చివరికి అభినవ్ ఆఫీస్ సమస్యలను పరిష్కరించి కుటుంబాన్ని ఎలా కలిపాడు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.