ఉస్తాద్ రామ్ పోతినేని – డైరెక్టర్ మహేష్ బాబు పి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా. షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది. రీసెంట్ గా ఈసినిమా నుండి రెండు పాటలు రిలీజై సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోడంతో అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈసినిమా నుండి నెక్స్ట్ అప్డేట్ గా టీజర్ ను వదలనున్నారు. ప్రస్తుతం అందుకు సంబధించిన పనులు జరుగుతున్నాయి. అందులో భాగంగా రామ్ టీజర్ కి డబ్బింగ్ కూడా చెప్పేశాడు.వచ్చే వారంలో ఈటీజర్ వచ్చే ఛాన్స్ వుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో ఫ్యాన్ బయోపిక్ గా తెరక్కుతున్న ఈసినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర స్టార్ హీరో పాత్రలో కనిపించనుండగా అతని అభిమానిగా సాగర్ పాత్రలో రామ్ నటిస్తున్నాడు. ఇందులో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుండగా తమిళ మ్యూజిక్ ద్వయం వివేక్ – మెర్విన్ సంగీతం అందిస్తున్నారు.మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.నవంబర్ 28 న ఆంధ్ర కింగ్ తాలూకా థియేటర్లోకి రానుంది. ఇక ఈసినిమాతో హిట్ కొట్టి ఫామ్ లోకి రావాలని రామ్ చూస్తున్నాడు.ఫ్యాన్స్ కూడా ఈసినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























