మలయాళ ఇండస్ట్రీ హిట్ లోక కేరళలో 100 కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది.ఇంతకుముందు వరకు కేవలం మోహన్ లాల్ తుడరమ్ ఈ ఫీట్ సాధించగా తాజాగా లోక కూడా ఈ జాబితాలోకి చేరిపోయింది.లోక 25రోజుల్లో కేరళలో 104కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.దాంతో ప్రస్తుతం కేరళ హైయెస్ట్ గ్రాసర్ గా కొనసాగుతున్న తుడరమ్ (118కోట్లు) కలెక్షన్స్ ను కూడా ఫుల్ రన్ లో లోక బీట్ చేయడం సాధ్యమయ్యేలానే వుంది.ఇప్పుడప్పుడే ఈసినిమా ఓటీటీలోకి కూడా రాదని నిర్మాత దుల్కర్ సల్మాన్ క్లారిటీ ఇచ్చాడు.సో లోక లాంగ్ రన్ గ్యారెంటీ.ఆలెక్కన లోక ఫుల్ రన్ లో ఈసినిమాహైయెస్ట్ గ్రాసర్ గా నిలువనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక నాలుగో వారంలోనూ లోక సెన్సేషనల్ వసూళ్లను రాబట్టుకొంటుంది.నిన్న ఒక్క రోజే దాదాపు 4 కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది. దాంతో ఈసినిమా 25 రోజుల్లో 275 కోట్ల గ్రాస్ వసూళ్లను అందుకుంది.ఫుల్ రన్ లో 300 కోట్ల మార్క్ ను టచ్ చేయనుంది.అదే జరిగితే మాలీవుడ్ లో మొదటి 300కోట్ల సినిమాగా చరిత్ర సృష్టించనుంది.అంతేకాదు అత్యధిక వసూళ్లను రాబట్టిన ఫస్ట్ సౌత్ ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీగా కూడా లోక రికార్డు సృష్టించింది.
ఇక ఈసినిమా తెలుగులో కొత్తలోక గా విడుదలై బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ప్రముఖ నిర్మాత నాగవంశీ ఈసినిమాను తెలుగులో రిలీజ్ చేశాడు. ఈసినిమాను దుల్కర్ 30 కోట్ల తో నిర్మించగా ఊహించని లాభాలు తీసుకొస్తుంది. సూపర్ హీరో బ్యాక్ డ్రాప్ లో డొమినిక్ అరుణ్ తెరకెక్కించిన ఈసినిమాలో కళ్యాణి ప్రియదర్శన్ లీడ్ లో నటించగా ప్రేమలు ఫేమ్ నస్లేన్ కీలక పాత్రలో కనిపించాడు.జేక్స్ బిజోయ్ సంగీతం అందించాడు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























