ఇండస్ట్రీ హిట్ ఘనత సాధించిన లోక 

Lokah Creates History with Industry Hit

సూపర్ హీరో బ్యాక్ డ్రాప్ తో మలయాళంలో తెరకెక్కిన లోకః చాప్టర్ 1 – చంద్ర బాక్సాఫీస్ వద్ద రాంపేజ్ కొనసాగిస్తూ మలయాళ ఇండస్ట్రీ హిట్ గా రికార్డు సృష్టించింది.నాలుగో వారంలోకి  ఎంట్రీ ఇచ్చినా ఎక్కడా  స్లో అవ్వకుండా సాలిడ్ వసూళ్లను  రాబట్టుకుంటుంది.ఇక ఈ సినిమా నిన్నటి తో ఎంపురాన్ కలెక్షన్స్ ను బీట్ చేసి ఇండస్ట్రీ హిట్ గా ఘనత సాధించింది. ఎంపురాన్ ఫుల్ రన్ లో 262కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టగా కేవలం 24 రోజుల్లోనే లోక ఆ కలెక్షన్స్ ను క్రాస్ చేసి చరిత్ర సృష్టించింది. అంతేకాదు అత్యధిక వసూళ్లను రాబట్టిన ఫస్ట్ సౌత్  ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీగా  కూడా రికార్డు సృష్టించింది.ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా 24 రోజుల్లో 264 కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది. 

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా కేవలం మలయాళంలోనే కాదు తెలుగులోనూ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.తెలుగులో కొత్త లోక గా విడుదలకాగా బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసుకొని క్లీన్ హిట్ గా నిలిచింది. ప్రముఖ నిర్మాత నాగవంశీ ఈసినిమాను తెలుగులో రిలీజ్ చేశాడు.   

ఇందులో కళ్యాణి ప్రియదర్శన్ లీడ్ లో నటించగా డొమినిక్ అరుణ్  డైరెక్ట్ చేశాడు. ప్రేమలు ఫేమ్ నస్లేన్ కీలక పాత్రలో కనిపించాడు.జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ దాదాపు 30 కోట్ల బడ్జెట్ తో ఈసినిమాను నిర్మించాడు. 

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.