కాంతార చాఫ్టర్ 1 సినిమాకి ప్రభాస్ సాయం

Kantara Chapter 1 Gets Support from Prabhas

మచ్ అవైటెడ్ ప్రీక్వెల్ కాంతార: ఏ లెజండ్ – చాప్టర్ 1 విడుదలకు రెడీ అవుతుంది.ఇప్పటివరకు ఈసినిమా నుండి పెద్దగా ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ అవ్వకున్నా హైప్ మాత్రం భారీగా వుంది. ఫస్ట్ పార్ట్ కాంతార బ్లాక్ బస్టర్ కావడమే ఇందుకు కారణం.ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈసినిమా అన్ని భాషల్లో కలిపి 400 కోట్లపైనే వసూళ్లను రాబట్టింది. ఇక ఇప్పుడు కాంతార చాఫ్టర్ 1 రానుంది. హైప్ తగ్గట్లే సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరిగింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా ట్రైలర్ విడుదలకానుంది. ఈనెల 22 న మధ్యాహ్నం 12: 45 గంటలకు విడుదల చేయనున్నారు.ఒక్కో భాషలో ఒక్కో స్టార్ హీరో తో ఈ ట్రైలర్ లాంఛ్ చేయిస్తున్నారు. అందులో భాగంగా తెలుగులో రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదగా ట్రైలర్ లాంఛ్ జరుగనుంది. ప్రభాస్ ఇంతకుముందు హోంబాలే ఫిలిమ్స్ బ్యానర్ లో సలార్ చేసిన విషయం తెలిసిందే. ఇక అలాగే మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్, తమిళంలో శివ కార్తికేయన్, హిందీలో హృతిక్ రోషన్ కాంతార చాప్టర్ 1 ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.ఈ ట్రైలర్ వచ్చాక సినిమా మీద వున్న హైప్ రెట్టింపు కానుంది.

కాంతార చాప్టర్ లో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించగా అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నాడు.హోంబలే ఫిలిమ్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. అక్టోబర్ 2 పాన్ ఇండియా భాషల్లో విడుదలకానుంది.బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ఈసినిమా 1000 కోట్ల క్లబ్ లో చేరనుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.