టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ నటుడు కిరణ్ అబ్బవరం రోడ్డు భద్రతపై తన ఆవేదనను వ్యక్తపరిచారు. తన అన్నయ్య రోడ్డు ప్రమాదంలో చనిపోయిన తర్వాత డ్రైవింగ్‌లో తన విధానం పూర్తిగా మారిందని ఆయన వెల్లడించారు. హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని జలవిహార్‌లో జరిగిన ట్రాఫిక్ సమ్మిట్ 2025 కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
యువతే అధికంగా మృతి..
ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితంలో జరిగిన విషాదాన్ని పంచుకున్న ఆయన, యువత ట్రాఫిక్ నిబంధనలు పాటించడంలో నిర్లక్ష్యం వహించరాదని సూచించారు. అలాగే, ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఇతర వక్తలు, హైదరాబాద్ నగరంలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారిలో 18-35 ఏళ్ల యువతే ఎక్కువగా ఉన్నారని పేర్కొన్నారు. దాదాపు 92 లక్షల వాహనాలు ఉన్న నగరంలో 9 వేల కిలోమీటర్ల రోడ్డు విస్తరణ జరిగిందని హైదరాబాద్ నగర సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.
ఇక ఈ సమ్మిట్‌లో నగర అదనపు సీపీ విక్రమ్‌సింగ్ మాన్, ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్, డీసీపీలు రాహుల్‌హెగ్డే, వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కాగా, ఈ రోడ్డు భద్రతా సమ్మిట్ నగరంలోని యువతలో అవగాహన పెంచడానికి, ప్రమాదాలను తగ్గించడానికి ఉద్దేశించి నిర్వహించారు. ఈ కార్యక్రమం రోడ్డు భద్రతకు సంబంధించి మరిన్ని చర్యలు తీసుకోవాలని సూచించింది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























