పరాశక్తి ఫైనల్ షెడ్యూల్ స్టార్ట్ 

parasakthi final schedule begins

తమిళ హీరో శివ కార్తికేయన్ 25వ సినిమాగా వస్తుంది పరాశక్తి.ఈ ల్యాండ్ మార్క్ మూవీని ఆకాశం హద్దురా ఫేమ్ సుధా కొంగర తెరకెక్కిస్తున్నారు.ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది.ఈ రోజే ఈషెడ్యూల్ చెన్నై లో స్టార్ట్ అయ్యింది.దాదాపు 20రోజులపాటు ఈ షెడ్యూల్ జరుగనుంది.దాంతో షూటింగ్ పూర్తి కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రీసెంట్ గా రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు.పొంగల్ కానుకగా జనవరి 14న తమిళ్ తోపాటు తెలుగు ,కన్నడ ,మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది.అయితే అదే టైంలో విజయ్ జన నాయగన్ విడుదలకానుండడంతో ఈరెండు సినిమాల మధ్య ఇంట్రస్టింగ్ క్లాష్ జరుగనుంది.పరాశక్తి లో అథర్వ ,శ్రీలీల కీలకపాత్రల్లో నటిస్తుడగా రవి మోహన్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.జివి ప్రకాష్ కుమార్ ఈసినిమాకు సంగీతం అందిస్తుండగా ఆకాష్ భాస్కరన్ నిర్మిస్తున్నారు.

ఇక అమరన్ తో కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన శివకార్తికేయన్ ఈనెలలో మదరాసితో ప్రేక్షకులముందుకు వచ్చాడు.ఈసినిమా 100కోట్ల వసూళ్లను రాబట్టుకొని యావరేజ్ అనిపించుకుంది.మురగదాస్ ఈసినిమాను డైరెక్ట్ చేయగా అనిరుధ్ సంగీతం అందించాడు.ఇందులో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించింది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.