పలు సినిమాలకు దర్శకత్వం వహించి, ‘లవ్ టుడే’తో హీరోగా మారిన ప్రదీప్ రంగనాథన్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘డ్యూడ్’. ఈ సినిమాకు సంబంధించిన రెండో సింగిల్ ‘బాగుండు పో’ ను ఇటీవల విడుదల చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ వంటి పెద్ద నిర్మాణ సంస్థ ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తుండటంతో ఈ పాట తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘బాగుండు పో’ సాంగ్.. లవ్ ఫెయిల్యూర్‌కు ఒక ట్రీట్!
‘డ్యూడ్’ సినిమా నుండి వచ్చిన మొదటి సింగిల్ ‘ఊరూమ్ బ్లడ్’ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పుడు విడుదలైన ‘బాగుండు పో’ పాట ఒక లవ్ ఫెయిల్యూర్ సాంగ్ అని టైటిల్‌తోనే తెలుస్తోంది. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ కంపోజ్ చేసిన ఈ పాట, ప్రేమలో విఫలమైన యువత మనసులను తాకుతుందని చెబుతున్నారు. సంజిత్ హెగ్డేతో కలిసి సాయి అభ్యంకర్ ఆలపించారు.
‘డ్యూడ్’ విశేషాలు..
కీర్తిశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాతో మమితా తెలుగులో అడుగుపెడుతున్నారని కూడా తెలుస్తోంది. నటుడు శరత్ కుమార్ కూడా ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.
ప్రదీప్ రంగనాథన్ మరియు మామితా బైజు మధ్య ఉన్న కెమిస్ట్రీ సినిమాకు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. సినిమాలోని ఫస్ట్ సింగిల్ ‘ఊరూమ్ బ్లడ్’ ఒక ఎనర్జిటిక్ డ్యాన్స్ నెంబర్ అయితే, ‘బాగుండు పో’ ఒక మెలోడీగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 17న థియేటర్లలో విడుదల కానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























