డ్యూడ్ రిలీజ్ డేట్ లాక్ 

dude release date locked

లవ్ టుడే , డ్రాగన్ లతో వరుసగా రెండు సార్లు 100 కోట్ల క్లబ్ లో చేరిన కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథ్ నెక్స్ట్ డ్యూడ్ తో రానున్నాడు. టాలీవుడ్ టాప్ బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ ఈసినిమాను నిర్మిస్తుంది.తమిళంలో వీరికి ఇది రెండో సినిమా.కొత్త డైరెక్టర్ కీర్తిశ్వరన్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా ప్రేమలు ఫేమ్ మమితా బైజు కథానాయికగా నటిస్తుంది.యంగ్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు.షూటింగ్ కూడా ఫైనల్ కు చేరుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్


యూత్ ఫుల్ ఎంటరైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.రీసెంట్ గా ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ బూమ్ బూమ్ రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.ఈరోజు సెకండ్ సాంగ్ ను కూడా రిలీజ్ చేయనున్నారు .ఇక మేకర్స్ డ్యూడ్ రిలీజ్ డేట్ కూడా చెప్పేశారు.అక్టోబర్ 17న తమిళ్ తోపాటు డ్యూడ్ తెలుగులోనూ రిలీజ్ కానుంది.సెకండ్ సింగిల్ రిలీజ్ సందర్భంగా రిలీజ్ డేట్ ను ప్రకటించారు.

 అయితే ప్రదీప్ రంగనాథన్ మరో సినిమా ఎల్ఐకె (లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ) కూడా ఇదే డేట్ కు రిలీజ్ కానుందని ఇంతకుముందు ప్రకటించారు.నిజానికి ఈసినిమా సెప్టెంబర్ లోనే రావాల్సింది కానీ అనుకున్న టైంకు రెడీ కాకపోవడంతో మేకర్స్ అక్టోబర్ 17న రిలీజ్ చేస్తున్నామని రీసెంట్ గా ప్రకటించారు.కానీ డ్యూడ్ ఫస్ట్ నుండి దీపావళికి విడుదలవుతుందని అనౌన్స్ చేసుకుంటూ వస్తుంది.ఇక ఇప్పుడు డేట్ కూడా ప్రకటించడంతో ఎల్ఐకె వెనక్కి వెళ్ళిపోయింది.త్వరలోనే ఎల్ఐకె మేకర్స్ మరో డేట్ ను ప్రకటించనున్నారు. 

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.