మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ కు ప్రమాదం జరిగింది. ఒక కమర్షియల్ యాడ్ షూటింగ్ భాగంగా ఆయన గాయపడ్డారు. హైదరాబాద్లో ఒక వాణిజ్య ప్రకటన షూటింగ్ సమయంలో అనుకోకుండా ఒక చిన్న ప్రమాదం చోటుచేసుకోగా, ఈ ఘటనలో ఆయన కాలికి స్వల్ప గాయాలయ్యాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఎన్టీఆర్ గాయపడ్డారనే వార్తలు రావడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తారక్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో వారు పోస్టులు పెడుతున్నారు. జూనియర్ త్వరగా కోలుకుని, మళ్లీ పాత ఉత్సాహంతో పనిలోకి తిరిగి రావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.
స్పందించిన ఎన్టీఆర్ టీమ్..
ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ కార్యాలయం స్పందించింది. వైద్యుల సలహా మేరకు, పూర్తి ఆరోగ్యాన్ని తిరిగి పొందేందుకు ఆయన వచ్చే కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకోనున్నారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీమ్ స్పష్టం చేసింది. అలాగే, అభిమానులు మరియు మీడియా ఎటువంటి ఊహాగానాలు చేయకుండా ఉండాలని కోరింది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























