మచ్ అవైటెడ్ కాంతార ఏ లెజండ్ – చాప్టర్ 1 మరో 13 రోజుల్లో థియేటర్లోకి రానుంది.హైప్ భారీగా ఉండడంతో దేశ వ్యాప్తంగా ఈసినిమా భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.అన్ని భాషల్లో భారీ ధరలకు థియేట్రికల్ రైట్స్ అమ్మడైయ్యాయి.ఇక ఈసినిమా ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సినిమా లవర్స్.ఈ రోజు ట్రైలర్ డేట్ కూడా చెప్పేశారు మేకర్స్.ఈనెల 22న మధ్యాహ్నం 12 :45 గంటలకు ట్రైలర్ రిలీజ్ కానుంది. .
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దాదాపు మూడేళ్ళ క్రితం ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి 400 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి బిగెస్ట్ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది కాంతార.ఒక్క కన్నడ లోనే తెలుగు ,హిందీ భాషల్లో కూడా సెన్సేషన్ సృష్టించింది.ఇక ఈసినిమాకు ప్రీక్వెల్ గా వస్తున్న కాంతార చాప్టర్ 1పై అంచనాలు భారీగా వున్నాయి.బ్లాక్ బస్టర్ టాక్ వస్తే 1000కోట్ల వసూళ్లను రాబట్టే సత్తా వున్న సినిమా ఇది.ఈ చిత్రంలో 500 మంది యోధులు, సుమారు 3,000 మంది ప్రజలు పాల్గొనే ఒక భారీ యుద్ధ సన్నివేశాన్ని రూపొందించారు.జాతీయ, అంతర్జాతీయ నిపుణుల పర్యవేక్షణలో 25 ఎకరాల పట్టణం నిర్మించి, దాదాపు 45–50 రోజులపాటు ఈ షూటింగ్ జరిగింది. సినిమాలో ఈ ఎపిసోడ్ హైలైట్ అవ్వనుండు.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ శరవేగంగా జరుగుతుంది.ఈసినిమా విఎఫ్ఎక్స్ కోసం ఏకంగా 20 కంపెనీలు పనిచేస్తున్నాయి.రిషబ్ శెట్టి డైరెక్ట్ చేస్తూ నటించిన ఈసినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించగా అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నాడు.భారీ బడ్జెట్ తో హోంబలే ఫిలిమ్స్ నిర్మిస్తుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























