యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధపురి థియేటర్లలో అదరగొడుతుంది.గత వారం విడుదలైన ఈసినిమా పాజిటివ్ టాక్ తో సూపర్ హిట్ అనిపించుకుని బ్లాక్ బస్టర్ వైపు దూసుకుపోతుంది.ఇప్పటికే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ ను క్రాస్ చేసి లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా 22 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుందని మేకర్స్ ప్రకటించారు.సెకండ్ వీక్ కూడా ఇదే జోరు కొనసాగించనుంది.అయితే వచ్చే వారంలో ఓజీ వస్తుండడంతో కిష్కింధపురికి భారీ పోటీ ఎదురుకోనుంది. ఫుల్ రన్ లో ఈసినిమా 30కోట్ల వరకు రాబట్టుకోనుంది.
ఇక ఈసినిమాతో సాయి శ్రీనివాస్ ఎట్టకేలకు సాలిడ్ హిట్ కొట్టాడు. రాక్షసుడు తరువాత ఎప్పటి నుండో మళ్ళీ అలాంటి విజయం కోసం ఎదురుచూడగా ఫైనల్ గా కిష్కింధపురి ఆ కోరిక నెరవేర్చింది. హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈసినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా చావు కబురు చల్లగా ఫేమ్ కౌశిక్ పెగళ్లపాటి డైరెక్ట్ చేశాడు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించాడు. షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి ఈసినిమాను నిర్మించారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























