ఓజీ ట్రైలర్ డేట్ రివీల్

Trailer Date of OG Officially Out Now

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఓజీ ట్రైలర్ విడుదల తేదీపై ఎట్టకేలకు అధికారిక ప్రకటన వెలువడింది. ఈనెల 21న ఓజీ ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.అదే రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపనున్నారని సమాచారం.ఈసినిమాపై ఉన్న భారీ అంచనాలకు తగ్గట్టుగానే దర్శకుడు సుజీత్ ట్రైలర్‌ను అత్యంత పవర్ఫుల్‌గా డిజైన్ చేసినట్లు సమాచారం.యాక్షన్, డ్రామా, స్టైల్ కలగలిపి పవన్ కళ్యాణ్‌ను కొత్త అవతారంలో చూపించనున్నారని అభిమానులు ఆశిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక సాంగ్స్ సూపర్ హిట్ కావడంతో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.సుజీత్ డీసెంట్ గా వుంది అనేలా  తీసిన చాలు సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయం.ఇప్పటికే ఓవర్సీస్ లో ఈసినిమా అడ్వాన్స్ బుకింగ్స్ తో 1.7 మిలియన్ డాలర్ల వసూళ్లను సొంతం చేసుకుంది.ట్రైలర్ వచ్చాక ప్రీమియర్స్ తో కలుపుకొని  2 మిలియన్ మార్క్ ను క్రాస్ చేయనుంది.అలాగే ఆంధ్రాలో స్పెషల్ షోస్ తోపాటు టికెట్ హైక్ పెర్మిషన్ వచ్చింది. తెలంగాణ లో రావాల్సివుంది.హిట్ టాక్ వస్తే ఓజీ మొదటి రోజే  100కోట్ల వసూళ్లను రాబట్టుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.  

డీవీవీ దానయ్య నిర్మిస్తుండగా ఈసినిమాను థమన్ సంగీతం అందిస్తున్నారు.ఇందులో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్ నటించగా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.ఓజీ ఈనెల 25న పాన్ ఇండియా భాషల్లో విడుదలకానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.