విజయ్ ఆంటోనీ ఇటీవల ‘మార్గన్’ లాంటి హిట్ సినిమాతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఇప్పుడు ‘భద్రకాళి’తో మరోసారి ఆడియన్స్‌ను మెప్పించడానికి సిద్ధమయ్యారు. కాగా ఇది ఆయన 25వ చిత్రం కావడం విశేషం. అరుణ్ ప్రభు దర్శకత్వంలో తమిళంలో తెరకెక్కిన ‘శక్తి తిరుమగన్’ చిత్రాన్ని తెలుగులో ‘భద్రకాళి’ పేరుతో విడుదలవుతోంది. సెప్టెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘భద్రకాళి’ స్నీక్ పీక్ విడుదల..
విడుదలకు ఇంకా ఒక రోజు మాత్రమే ఉండటంతో, చిత్ర బృందం సినిమాపై అంచనాలను పెంచేందుకు ఒక స్నీక్ పీక్ వీడియోను విడుదల చేసింది. ఈ సినిమా కథ కేవలం ఒక రాజకీయ కథ కాదు, దీనిలో ఎన్నో ఎమోషనల్ లేయర్స్ ఉన్నాయని స్నీక్ పీక్ వీడియో చూస్తే అర్థమవుతోంది. దర్శకుడు అరుణ్ ప్రభు యొక్క కథ, దర్శకత్వం సినిమాకు ప్రధాన బలంగా ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.
రివెంజ్ పొలిటికల్ థ్రిల్లర్‌గా ‘భద్రకాళి’
విజయ్ ఆంటోనీ నటిస్తూ, సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఒక రివెంజ్ పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందించారు. స్నీక్ పీక్ వీడియోలో చూపించిన మొదటి 4 నిమిషాలు సినిమా కథలో ఎమోషనల్ పవర్ ఎంత ఉందో తెలియజేస్తోంది. ఒక శిశువుగా ఉన్నప్పటినుంచి విజయ్ ఆంటోనీ క్యారెక్టర్‌ను పరిచయం చేయడం అనేది ఒక బోల్డ్ మూవ్ అని ఫిల్మ్ మేకర్స్ చెబుతున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























