మన శంకరవరప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ పక్కా – డైరెక్టర్ బాబీ 

Mana Shankara Vara Prasad Garu is a Sure Shot Blockbuster says Director Bobby

బెల్లంకొండ సాయి శ్రీనివాస్,అనుపమ పరమేశ్వరన్ జంటగా  కౌశిక్ పెగల్లపాటి డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం కిష్కింధపురి.షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు.ఈనెల 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈసినిమా థియేటర్లలో సక్సెస్ ఫుల్ రన్ అవుతూ బ్లాక్ బస్టర్ విజయం దిశగా దూసుకుపోతుంది.ఈసందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు. హీరో సాయి దుర్గతేజ్, డైరెక్టర్ అనిల్ రావిపూడి, బాబీ, వశిష్ట,అనుదీప్ అతిధులు గా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇందులో  డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ .. అందరికి నమస్కారం. టీమ్ అందరికీ కంగ్రాజులేషన్స్.కౌశిక్ నాకు ఫస్ట్ సినిమా నుంచి తెలుసు.తన సినిమా బ్లాక్ బస్టర్ అవడం చాలా ఆనందంగా ఉంది. హీరో నిర్మాతల నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు.హారర్ ఫిలిమ్స్ చాలా జాగ్రత్తగా తీయాలి. చాలా చాలా స్ట్రాంగ్ కంటెంట్ ఉంటేనే జనం థియేటర్స్ కి వస్తారు. హారర్ తో పాటు మంచి మెసేజ్ ని పెట్టడం చాలా బాగా అనిపించింది. సాయి ఏ బ్యాగ్రౌండ్ లేనట్టుగానే చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. తన ఈ సినిమాతో విజయాన్ని అందుకోవడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. సాహు గారు ఈ సినిమాతో ఒక బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నారు. సంక్రాంతికి రాబోతున్న చిరంజీవి గారు అనిల్ గారు సినిమాలో కొన్ని పార్ట్స్ చూశాను. సినిమా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ కాబోతోంది.సాహూ గారికి కంగ్రాచ్యులేషన్స్ అలాగే  టీమ్ అందరికీ కంగ్రాచ్యులేషన్స్ అని అన్నారు. 

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.