బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ థ్రిల్లింగ్ బ్లాక్ బస్టర్ ‘కిష్కింధపురి’. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. అద్భుతమైన ప్రిమియర్స్‌తో మొదలైన ఈ చిత్రం సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని హౌస్ ఫుల్‌గా రన్ అవుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు. సుప్రీం హీరో సాయి దుర్గతేజ్, డైరెక్టర్స్ అనిల్ రావిపూడి, బాబీ, వశిష్ట, అనుదీప్ అతిధులుగా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది. ఈ సందర్భంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. “అందరికి నమస్కారం. టీమ్ అందరికి కంగ్రాజులేషన్స్. ప్రీ రిలీజ్ ఈవెంట్ పిలిచినప్పుడు హారర్ సినిమా అంటే నాకు భయం. చూడలేను అని చెప్పాను. నిజంగా నాకు భయం.”
“అయితే సాహు గారికి మాట ఇచ్చినట్టు ఈ సినిమా చూశాను. చాలా చోట్ల భయపడ్డాను. కొన్ని సీక్వెన్స్‌లో థియేటర్స్ మొత్తం షేక్ అయింది. అందరూ భయపడ్డారు. ఈ సెప్టెంబర్ ఒక సక్సెస్ఫుల్ సెప్టెంబర్ అయింది. ‘కొత్తలోక, మిరాయి, కిష్కింధపురి, లిటిల్ హార్ట్స్’ సినిమాలతో థియేటర్స్ కళకళలాడుతున్నాయి. థియేటర్స్‌లో ఒక చిన్న ఫెస్టివల్‌లా ఉంది. ఈ మూమెంట్ ఇలాగే కంటిన్యూ అవ్వాలి.”
“ఈ సినిమాను కౌశిక్ అద్భుతంగా తీశాడు. ఇక్కడ నుంచి తను సక్సెస్‌ని కంటిన్యూ చేస్తాడని కోరుకుంటున్నాను. తనని నమ్మి అవకాశం ఇచ్చిన నిర్మాత సాహు గారికి, సాయి గారికి కంగ్రాచ్యులేషన్స్. ఈ సినిమాతో మళ్లీ సక్సెస్ జర్నీ స్టార్ట్ చేసిన హీరో శ్రీనివాస్ గారు ఇదే కంటిన్యూ చేస్తూబ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకోవాలని కోరుకుంటున్నాను.” అని తెలిపారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























