హీరో నాని నిర్మాణంలో హార్ష్ రోషన్ ,శ్రీదేవి జంటగా రామ్ జగదీష్ తెరకెక్కించిన చిత్రం కోర్ట్ .పెద్దగా అంచనాలు లేకుండా సమ్మర్ లో విడుదలైన ఈసినిమా 50కోట్ల వసూళ్లతో బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఇక ఈసినిమాతో హార్ష్ రోషన్ హీరో గా ఎంట్రీ ఇచ్చాడు.ఇక మొదటి సినిమాతోనే భారీ హిట్ అందుకున్న హార్ష వరుసగా సినిమాలను లైన్లో పెడుతున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అందులో భాగంగా తన నెక్స్ట్ సినిమాను ప్రముఖ నిర్మాత కోన వెంకట్ బ్యానర్ లో చేస్తున్నాడు. బ్యాండ్ మేళం అనే టైటిల్ తో తెరక్కుతున్న ఈసినిమాలో కూడా శ్రీదేవినే హీరోయిన్ గా నటిస్తుంది. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతుంది.నిన్న ఈసినిమా అనౌన్స్ మెంట్ గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేశారు.
ఇక ఈరోజు హార్ష్ రోషన్ బర్త్ డే సందర్బంగా తన నెక్స్ట్ మూవీని కూడా ప్రకటించారు మేకర్స్.రమేష్ బండ్రెడ్డి ఈసినిమాను తెరకెక్కించనుండగా అరుణాచల్ క్రియేషన్స్ నిర్మించనుంది.బేబీ ఫేమ్ విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నాడు.త్వరలోనే షూట్ స్టార్ట్ కానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























