భారత ప్రధాని నరేంద్ర మోదీ నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఆయనపై అభినందనల వెల్లువ కురుస్తోంది. వివిధ రంగాల ప్రముఖులతో పాటు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు కూడా సోషల్ మీడియా వేదికగా ప్రధానికి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా, మోదీ పాలనను, దేశాభివృద్ధికి ఆయన చేస్తున్న కృషిని మెచ్చుకుంటూ పోస్టులు పెట్టడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రధాని మోదీ బర్త్‌డే.. విషెస్ తెలిపిన సినీ ప్రముఖులు
ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని టాలీవుడ్ ప్రముఖులు అనేకమంది ప్రధానికి బర్త్ డే విషెస్ తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ, మంచు సోదరులు విష్ణు, మనోజ్ వంటి తదితర అగ్ర నటులు ఉన్నారు. అలాగే దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సహా ఎంతోమంది సినీ ప్రముఖులు ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇంకా మోదీకి విషెస్ చెప్పినవారిలో కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్, ‘లోక నాయకుడు’ కమల్ హాసన్, ప్రముఖ తమిళ దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజా, ప్రముఖ సీనియర్ నటి ఖుష్బూ సుందర్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, బాలీవుడ్ నుండి.. సీనియర్ నటి హేమా మాలిని, ఆమీర్ ఖాన్, షారూఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, సోనూసూద్, కంగనా రనౌత్ వంటి ఇతర భాషల నటీనటులు కూడా ఉన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























