ఒక్క సక్సెస్ వచ్చాక ఆ డైరెక్టర్ కి అడ్వాన్స్ లు ఇచ్చి లాక్ చేసుకోవడం ఇండస్ట్రీ లో సహజం.ఇప్పుడు ఈ జాబితాలో చేరాడు లిటిల్ హార్ట్స్ డైరెక్టర్ సాయి మార్తాండ్.గత వారం చిన్న సినిమాగా విడుదలై బ్లాక్ బస్టర్ విజయంతో దూసుకుపోతుంది లిటిల్ హార్ట్స్.#90s వెబ్ సిరీస్ ఫేమ్ మౌళి హీరోగా నటించగా శివాని నాగరం మౌళికి జంటగా నటించింది.ఇప్పటికే ఈసినిమా 15 కోట్ల కుపైగా లాభాలను తీసుకొచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా చూసి స్టార్ హీరోలు ,డైరెక్టర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.లవ్ స్టోరీ తో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా సినిమాను తెరకెక్కించాడు సాయి మార్తాండ్.డైరెక్టర్ గా తనకు ఇదే మొదటి సినిమా.ముఖ్యంగా కామెడీని బాగా డీల్ చేయగలిగాడు.ఇక మొదటి సినిమా భారీ విజయం సాధించడం తో సాయి మార్తాండ్ కు వరుస ఆఫర్లు వస్తున్నాయి. అందులో భాగంగా తన నెక్స్ట్ సినిమాను ప్రముఖ నటుడు జగపతి బాబు నిర్మాణంలో చేయనున్నాడు.జగపతి బాబు ఆల్రెడీ అడ్వాన్స్ కూడా ఇచ్చేశాడు.
ఇక సాయి మార్తాండ్ కు టాప్ బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ నుండి కూడా అడ్వాన్స్ అందిందట.తన మూడో సినిమాను మైత్రి మూవీస్ తో చేయనున్నాడు. మైత్రి అంటే బడ్జెట్ కు లోటు ఉండదు.సో సరైన కథతో మైత్రిలో పెద్ద సినిమానే ప్లాన్ చేయనున్నాడు సాయి మార్తాండ్.ఈసినిమా తన కెరీర్ కు చాలా హెల్ప్ అవ్వనుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























