మోహన్ లాల్ వృషభ టీజర్ రానుంది

Pan-India Film Vrusshabha Teaser Set for Grand Reveal

మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ వృషభ. భారీ బడ్జెట్ తో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ చిత్రంపై మలయాళంలో భారీ అంచనాలు వున్నాయి.ఇక ఈసినిమా టీజర్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్.ఈనెల 18న పాన్ ఇండియా భాషల్లో ఈ టీజర్ విడుదలకానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటి శన్యా మల్హోత్రా కీలక పాత్రలో నటిస్తుండగా ఈ సినిమాను నంద కిషోర్ డైరెక్ట్ చేస్తున్నారు.వీఎఫ్ఎక్స్ పరంగా కూడా వృషభ ప్రత్యేకమైన ముద్ర వేసేలా తెరకెక్కుతోందని తెలుస్తోంది.టీజర్‌తో సినిమా స్కేల్, కాన్సెప్ట్ పై మరింత క్లారిటీ రానుంది.శోభా కపూర్ ,ఏక్తా కపూర్ ఈసినిమాను నిర్మిస్తుండగా సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు. ఈఏడాది చివర్లో ఈసినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

ఇక వరుస సక్సెస్ లతో ప్రస్తుతం పీక్ ఫామ్ లో కొనసాగుతున్నారు మోహన్ లాల్.ఈఏడాది సమ్మర్ లో తుడరమ్ తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఈ సీనియర్ హీరో రీసెంట్ గా హృదయపూర్వం తో మరో బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకున్నారు.ఈసినిమా 70 కోట్లకుపైనే వసూళ్లను రాబట్టుకుంది.ఫుల్ రన్ లో 100 కోట్ల క్లబ్ లో చేరనుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.