హీరో విజయ్ ఆంటోనీ ‘మార్గన్’ విజయం తర్వాత మరో పవర్ ఫుల్ ప్రాజెక్ట్ ‘భద్రకాళి’తో వస్తున్నారు. విజయ్ ఆంటోనీకి ల్యాండ్‌మార్క్ మూవీగా నిలిచే ఈ చిత్రానికి అరుణ్ ప్రభు దర్శకత్వం వహించగా, సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామాంజనేయులు జవ్వాజీ నిర్మించారు. ఈ ప్రాజెక్ట్‌ను విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్, మీరా విజయ్ ఆంటోనీ సమర్పిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కనెక్ట్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియాతో కలిసి ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ రిలీజ్ చేస్తోంది. ‘భద్రకాళి’ సెప్టెంబర్ 19న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ గ్రాండ్‌గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా హీరోయిన్ తృప్తి రవీంద్ర మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. ఈ వేడుకకు వచ్చిన అందరికీ ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన విజయ్ గారికి, అరుణ్ గారికి ధన్యవాదాలు. ఈ సినిమా నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. నిర్మాత రామ్ గారికి ధన్యవాదాలు. ఈ సినిమాలో పార్ట్ కావడం చాలా ఆనందంగా ఉంది. సెప్టెంబర్ 19న ఈ సినిమాని అందరూ థియేటర్స్‌లో చూడాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.
అలాగే మరో హీరోయిన్ రియా మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. భద్రకాళి సినిమా నాకు చాలా మంచి ఎక్స్‌పీరియన్స్‌ని ఇచ్చింది. ఈ సినిమా నాకు తెలుగు భాషని, తెలుగు ప్రేక్షకుల్ని పరిచయం చేసింది. విజయ్ గారితో కలిసి వర్క్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. అరుణ్ ప్రభు గారికి, నిర్మాత రామ్ గారికి అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. తప్పకుండా ఈ సినిమా మీ అందరిని అలరిస్తుంది” అని చెప్పారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























