పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మరో 9 రోజుల్లో థియేటర్లలోకి వస్తుంది. ఇప్పటికే ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి. గ్యాంగ్ స్టార్ మూవీ కావడంతో ఫ్యాన్స్ లో విపరీతమైన క్రేజ్ నెలకొంది. ఇక ఇప్పటివరకు ఈసినిమా నుండి వచ్చిన సాంగ్స్ అన్ని కూడా చార్ట్ బస్టర్స్ అవ్వడంతో హైప్ డబుల్ అయ్యింది. హరి హర వీరమల్లు లో సాంగ్స్ అనుకున్నంత రెస్పాన్స్ తెచ్చుకోలేకపోయాయి. కానీ ఓజీ మాత్రం సాంగ్స్ విషయంలో ఎక్కడా డిసప్పాయింట్ చేయడం లేదు.ఇప్పటివరకు ఓజీ నుండి 4 పాటలు రిలీజ్ అయ్యాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇందులో ఒక్కటే మెలోడీ సాంగ్ .మిగితా మూడు పాటలు ఎలివేషన్ సాంగ్స్ .వీటిని మిక్సింగ్ చేసిన విధానానికి ఫిదా అవ్వాల్సిందే.తమన్ ఈ సాంగ్స్ ను హాలీవుడ్ స్టయిల్లో కంపోజ్ చేశాడు. పవర్ ఫుల్ లిరిక్స్ తో ప్రతి పాట రిపీట్ లో వినేలా వుంది. నిన్న రిలీజ్ చేసిన గన్స్ N రోజెస్ ప్రస్తుతం యూట్యూబ్ లో మొదటి స్థానం లో ట్రెండింగ్ లో వుంది. ఇంకా ఈసినిమా నుండి స్పెషల్ సాంగ్ ఒకటి బయటికి రావాల్సివుంది. ఓవరాల్ గా తమన్ ఆడియో తో సినిమాను సగం హిట్ చేసేశాడు. డైరెక్టర్ సుజీత్ కూడా సినిమాను బాగా తీస్తే బాక్సాఫీస్ వద్ద ఓజీ రాంపేజ్ ఖాయం.
నెక్స్ట్ ఈసినిమా నుండి ట్రైలర్ రానుంది. ప్రియాంక మోహన్ ఇందులో హీరోయిన్ గా నటించగా ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య డివివి , కళ్యాణ్ దాసరి ఈసినిమాను నిర్మిస్తున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























