విజయ్ ఆంటోనీ మల్టీ ట్యాలెంటెడ్ హీరో – నిర్మాత సురేష్ బాబు

Vijay Antony is a Multi Talented Hero Producer Suresh Babu

హీరో విజయ్ ఆంటోనీ ‘మార్గన్’ విజయం తర్వాత మరో పవర్ ఫుల్ ప్రాజెక్ట్‌ ‘భద్రకాళి’తో వస్తున్నారు. విజయ్ ఆంటోనీకి ల్యాండ్‌మార్క్ మూవీగా నిలిచే ఈ చిత్రానికి అరుణ్ ప్రభు దర్శకత్వం వహించగా, సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామాంజనేయులు జవ్వాజీ నిర్మించారు. ఈ ప్రాజెక్ట్‌ను విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్, మీరా విజయ్ ఆంటోనీ సమర్పిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కనెక్ట్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియాతో కలిసి ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ రిలీజ్ చేస్తోంది. ‘భద్రకాళి’ సెప్టెంబర్ 19న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ గ్రాండ్‌గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ.. “అందరికి నమస్కారం. భద్రకాళి సినిమాని తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. విజయ్ ఆంటోనీ గారు మల్టీ టాస్కింగ్‌ని చాలా అద్భుతంగా చేస్తూ మంచి ప్రోడక్ట్స్ అందిస్తున్నారు. ఈ క్రమశిక్షణ ఆయన్ని గొప్పస్థాయికి తీసుకు వెళుతుంది. రామాంజనేయులు గారికి ఆల్ ది వెరీ బెస్ట్. అరుణ్ వెరీ గుడ్ ఫిలిం మేకర్. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థాంక్యూ సో మచ్.” అని అన్నారు.

అలాగే చిత్ర దర్శకుడు అరుణ్ ప్రభువు మాట్లాడుతూ.. “అందరికి నమస్కారం. మీ అందరి సపోర్ట్ కి థాంక్యూ. ఈ సినిమా మీ అందరి అంచనాల్ని అందుకుంటుంది. ఇది మంచి పొలిటికల్ థ్రిల్లర్. ఇది ఏ రాష్ట్రానికో దేశానికి సంబంధించిన పాలిటిక్స్ కాదు. ఇది పీపుల్ పాలిటిక్స్. అందరికీ రిలేట్ అయ్యేలా ఉంటుంది. విజయ్ అంటోని గారి 25వ సినిమాగా భద్రకాళి రావడం చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన విజయ్ అంటోనీ గారికి ధన్యవాదాలు. నిర్మాత రామ్ గారు చాలా సపోర్ట్ చేశారు. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.” అని తెలిపారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.