మన శంకర వరప్రసాద్ గారు నెక్స్ట్ షెడ్యూల్ అప్డేట్

Next Shooting Update from Mana Shankara Vara Prasad Garu

మెగా స్టార్ చిరంజీవి – సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న సినిమా మన శంకరవరప్రసాద్ గారు. ప్రస్తుతం కీలకమైన షెడ్యూల్ జరుగుతుంది.ఇందులో రెండు సాంగ్స్ ను కూడా చిత్రీకరించారు.ఈనెల 19 వరకు ఈ షెడ్యూల్ జరుగనుంది.ఇక ఆ తరువాత షాట్ బ్రేక్ తీసుకొని అక్టోబర్ లో లాంగ్ షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నారు. దాదాపు 25రోజుల పాటు జరుగనున్న ఈషెడ్యూల్ తో షూటింగ్ కూడా కంప్లీట్ కానుంది.ఇందులో విక్టరీ వెంకటేష్ జాయిన్ కానున్నాడు.ఈసినిమాలో తను పవర్ ఫుల్ క్యామియో రోల్ లో కనిపించనున్నాడని తెలిసిందే. ఫైనల్ షెడ్యూల్ లో స్పెషల్ సాంగ్ ను కూడా షూట్ చేయనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో చిరు సరసన నయనతార నటిస్తుండగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.షైన్ స్క్రీన్స్ , గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సాహు గారపాటి ,సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు.సంక్రాంతి కానుకగా ఈసినిమా థియేటర్లలోకి రానుంది. త్వరలోనే రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు. ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.

ఇక ఈసినిమాను కంప్లీట్ చేసి చిరు తన నెక్స్ట్ సినిమాను బాబీ డైరెక్షన్ లో చేయనున్నాడు మోస్ట్ వైలెంట్ మూవీ గా తెరకెక్కనుంది. డిసెంబర్ నుండి షూట్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారు.కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మించనుంది ఈసినిమా తరువాత చిరు, శ్రీకాంత్ ఓదెల తో సినిమాను మొదలు పెట్టనున్నాడు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.