యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హారర్ థ్రిల్లర్ కిష్కింధపురి థియేటర్లలో ఎక్స్ లెంట్ రన్ ను కొనసాగిస్తోంది.మౌత్ టాక్ బాగుండడంతో మొదటి రోజు కంటే తరువాతి రెండు రోజులు ఎక్కువ వసూళ్లను రాబట్టుకొని బ్లాక్ బస్టర్ వైపు పరుగులు పెడుతుంది.శని ,ఆదివారాల్లో సెన్సేషనల్ గ్రోత్ చూపించడం తో మూడు రోజుల్లో 12కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
బాక్సాఫీస్ వద్ద మిగితా సినిమాలతో పోటీ వున్నా కూడా స్ట్రాంగ్ హోల్డ్ కొనసాగిస్తోంది.ఇక ఈసినిమా సోమవారం టెస్ట్ కూడా పాస్ అయిపొయింది. ఈరోజు కూడా బుక్ మై షో లో సూపర్ ట్రెండింగ్ ను కంటిన్యూ చేస్తుంది. ఓవరాల్ గా ఫుల్ రన్ లో కిష్కింధపురి 25కోట్ల వసూళ్లను రాబట్టుకోనుంది. ఓజీ వచ్చే వరకు మరో సినిమా లేకపోవడం అడ్వాంటేజ్ కానుంది.
ఇక ఈసినిమాతో ఎట్టకేలకు సాయి శ్రీనివాస్ సాలిడ్ హిట్ కొట్టాడు. రాక్షసుడు తరువాత మళ్ళీ అలాంటి హిట్ కోసం సాయి శ్రీనివాస్ చాలా రోజుల ఎదురుచూడాల్సివచ్చింది. ఫైనల్ గా కిష్కింధపురితో ఆ విజయం దక్కింది. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించగా చావు కబురు చల్లగా ఫేమ్ కౌశిక్ పెగళ్లపాటి డైరెక్ట్ చేశాడు.షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి ఈసినిమాను నిర్మించగా చైతన్ భరద్వాజ్ సంగీతం అందించాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























