టాలీవుడ్ నవదళపతి సుధీర్ బాబు హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం జటాధర. ఈ సినిమాతో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా తొలిసారి తెలుగులో అడుగుపెడుతుండగా.. సీనియర్ నటి శిల్పా శిరోధ్కర్ మరో కీలక పాత్రలో కనిపించబోతుండటం విశేషం. తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మూవీకి సంబంధించి తాజాగా కీలక అప్డేట్ అందింది. నవంబర్ 7న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ నేడు వెల్లడించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రిలీజ్ డేట్ ఫిక్స్.. సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా పోటాపోటీగా..
జటాధర కథ యాక్షన్, ఎమోషన్‌ల మేళవింపుగా సాగనుందని చిత్ర బృందం చెబుతోంది. సుధీర్ బాబు లుక్, ఆయన యాక్షన్ స్టైల్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపుదిద్దినట్లు సమాచారం. మరోవైపు సోనాక్షి సిన్హా పాత్ర కథలో కీలక మలుపు తిప్పనుందని ఇండస్ట్రీ టాక్. శిల్పా శిరోధ్కర్ ఎమోషనల్ టచ్ ఇచ్చే రోల్‌లో మెప్పించనున్నారు. ఈ విభిన్న కాంబినేషన్ ఇప్పటికే సినీప్రియుల్లో మంచి హైప్‌ని క్రియేట్ చేసింది.
ఇక సాంకేతికంగా కూడా ఈ సినిమా విశేషంగా నిలుస్తుందని యూనిట్ నమ్మకంగా చెబుతోంది. ప్రత్యేకంగా యాక్షన్ సన్నివేశాలు, సంగీతం, సినిమాటోగ్రఫీ ప్రేక్షకులను థియేటర్లలో మంత్ర ముగ్ధులను చేస్తాయనేది ఫిల్మ్‌నగర్ అంచనా. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో, అభిమానులు ఎప్పుడెప్పుడా అని వేచి చూస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























