బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ అభిమానులకు గొప్ప శుభవార్త! ఆయన హీరోగా కొత్త సినిమా ప్రారంభమైంది. ఈ చిత్రానికి ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ అనే టైటిల్ ఖరారు చేశారు మేకర్స్. నేడు షూటింగ్ ప్రారంభమవగా.. లడఖ్ లోని అందమైన లోయలలో కీలకమైన సన్నివేశాల చిత్రీకరణను మొదలుపెట్టారు. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
2020లో భారత్-చైనా సైనికుల మధ్య గల్వాన్ లోయలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ దేశభక్తి యాక్షన్ డ్రామాను రూపొందిస్తున్నారు. ఈ వార్త సల్మాన్ ఖాన్ అభిమానుల్లో భారీ అంచనాలను పెంచింది. ఇక ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ ఒక ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. అయితే, ఇది గల్వాన్ వీరుడు, తెలంగాణకు చెందిన వీర సైనికుడు కల్నల్ సంతోష్ బాబు పాత్ర అని సమాచారం. ఈ పాత్ర కోసం ఆయన ప్రత్యేక శిక్షణ తీసుకున్నారని, మరియు ఫిజికల్‌గా ఎంతో కష్టపడుతున్నారని యూనిట్ వర్గాలు తెలిపాయి.
సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు, మరియు భావోద్వేగాలు ప్రేక్షకులకు గూస్ బంప్స్ ఇస్తాయని చిత్ర బృందం ఈ సందర్భంగా పేర్కొంది. ప్రస్తుతం కీలకమైన యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారని, ఆ తర్వాత ఇతర షెడ్యూల్స్ ఉంటాయని సమాచారం. ఈ సినిమాకు సంగీతం హిమేశ్ రేషమియా అందిస్తున్నారు. ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























