మైత్రి చేతికి కాంతార చాప్టర్ 1 

Mythri Movie Distributors LLP to Release Kantara Chapter 1 in Nizam

మచ్ అవైటెడ్ సీక్వెల్ కాంతార ఏ లెజండ్ – చాప్టర్ 1 విడుదలకు రెడీ అవుతుంది. అందులో భాగంగా అన్ని భాషల్లో  థియేట్రికల్ బిజినెస్ పూర్తి చేసుకుంటుంది.ప్రముఖ సంస్థలు ఈసినిమాను రైట్స్ తీసుకుంటున్నాయి.హిందీలో టాప్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఏఏ ఫిలిమ్స్ విడుదల చేస్తుండగా మలయాళంలో ప్రముఖ హీరో పృథీరాజ్ సుకుమారన్ రిలీజ్ చేస్తున్నాడు.ఓవర్సీస్ లో ఫార్స్ ఫిలిమ్స్ ఈ రైట్స్ తీసుకోగా ఇక నైజాంలో మైత్రి మూవీస్ రిలీజ్ చేయనుంది. ఇందుకుగాను మైత్రి, నిర్మాతలకు భారీ మొత్తంలో చెల్లించిందట.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక పోస్ట్ ప్రొడక్షన్ విషయానికి వస్తే ప్రస్తుతం ఫైనల్ కాపీని రెడీ చేసే పనిలో వుంది టీమ్.త్వరలోనే టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.రిషబ్ శెట్టి డైరెక్ట్ చేస్తూ నటించిన ఈసినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించగా అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నాడు.భారీ బడ్జెట్ తో హోంబలే ఫిలిమ్స్ ఈసినిమాను నిర్మిస్తుంది.అక్టోబర్ 2న కాంతార చాఫ్టర్ 1 థియేటర్లలోకి రానుంది. 

మూడేళ్ళ క్రితం ఎలాంటి అంచనాలు లేకుండా దాదాపు 400కోట్ల వసూళ్లను రాబట్టుకొని సెన్సేషన్ సృష్టించింది కాంతార.దాంతో సీక్వెల్ పై భారీ అంచనాలు వున్నాయి.బ్లాక్ బస్టర్ టాక్ వస్తే  ఈసినిమా బాక్సాఫీస్ వద్ద  విధ్వంసం సృష్టించడం ఖాయం. దాదాపు 30దేశాల్లో కాంతార చాప్టర్ 1 రిలీజ్ కానుంది. 

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.