యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం ‘కె-ర్యాంప్’. జైన్స్ నాని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్లో ‘రంగబలి’ ఫేమ్ యుక్తి తరేజా కథానాయికగా నటిస్తుండగా.. నరేష్, సాయి కుమార్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలచేసిన ప్రమోషనల్ కంటెంట్ అందరినీ ఆకట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అలాగే, ఇంతకుముందు రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ ‘ఓనమ్’ సాంగ్, సోషల్ మీడియా పదాలతో మలయాళ ట్రెడిషన్ కనిపించేలా ఫుల్ ఎనర్జిటిక్ జోష్‌తో మ్యూజిక్ లవర్స్‌ని ఇంప్రెస్ చేసింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి తాజాగా ఒక మధురమైన పాటను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ‘కలలే కలలే’ అంటూ సాగే ఈ సాంగ్, వినసొంపైన మెలోడీతో శ్రోతల హృదయాలను హత్తుకుంటోంది.
యువ సంగీత దర్శకుడు చేతన్ భరద్వాజ్ అద్భుతమైన ట్యూన్ అందించాడు. పాటలోని హార్మోనీ, మరియు సాహిత్యం కలగలిపి ఒక మ్యాజికల్ ఫీలింగ్‌ను ఇస్తున్నాయి. సినిమా కథాంశానికి ఈ పాట ఒక ఆత్మగా నిలుస్తుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. హీరో, హీరోయిన్ మధ్య వచ్చే లవ్ డ్యూయెట్లా దీనిని చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
విడుదలైన కొద్ది గంటల్లోనే ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయింది. ఈ పాటతో కె-ర్యాంప్ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. కాగా ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ సంస్థల సమర్పణలో రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 18న థియేటర్లలోకి రానుంది.
ఇక ఇదిలావుంటే, మరోవైపు కిరణ్ అబ్బవరం హీరోగా మరో లవ్ ఎంటర్టైనర్ ‘చెన్నై లవ్ స్టోరీ’ మూవీ తెరకెక్కుతుండగా.. దీనికి రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన సరసన శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్గా నటిస్తున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























