పెద్ది.. సగం షూటింగ్ కంప్లీట్

Peddi Movie is Halfway Through It's Production

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘పెద్ది’. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాకి ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. కొన్నిరోజులక్రితం ఫస్ట్ షాట్ పేరుతో రిలీజ్ చేసిన గ్లింప్స్ మూవీపై అంచనాలను అమాంతం పెంచేసింది. దీంతో ఈ సినిమా అప్డేట్స్ కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో పెద్ది చిత్రానికి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చింది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్‌ సగభాగం పూర్తయింద. ఈ మేరకు చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. ఇది మెగా ఫ్యాన్స్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. మరోవైపు షూటింగ్‌తో పాటు ఎడిటింగ్ పనులను కూడా ఏకకాలంలో కొనసాగిస్తోంది చిత్ర యూనిట్.

ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వంలో రామ్ చరణ్‌పై ఇప్పటికే ఒక భారీ పాటను చిత్రీకరించారు. ఈ సినిమాలో రామ్ చరణ్‌కు జోడీగా బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ నటిస్తుండగా, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా వచ్చే ఏడాది మార్చి 27న, రామ్ చరణ్ బర్త్ డే కానుకగా పెద్దిని విడుదల చేయనున్నారు మేకర్స్.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.