కేంద్రం కీలక నిర్ణయం.. జీఎస్టీలో మార్పులు, సింగిల్ స్క్రీన్లకు ఉపశమనం

Centre New GST Rates Announced, Relief For Single Screens

కేంద్ర ప్రభుత్వం సినీ ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై సినిమా టికెట్ రేట్లు కొంతమేర తగ్గనున్నాయి. కేంద్రం తాజాగా ప్రకటించిన కొత్త జీఎస్టీ రేట్లు దేశంలో సినిమా పరిశ్రమకు కొత్త ఊపిరినిచ్చినట్టయింది. టికెట్ ధరలపై కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం కొంతవరకు ప్రేక్షకులకు ఊరట కలిగించింది. ఇంతకుముందు జీఎస్టీ వసూలుకు సంబంధించి నాలుగు శ్లాబులు ఉండగా, ఇకపై రెండే శ్లాబులు ఉండనున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రూ.100 లోపు టికెట్లపై ఊరట

ఇంతవరకు రూ.100 లోపు ఉన్న సినిమా టికెట్లపై 12% జీఎస్టీ (GST) వసూలు అవుతోంది. కానీ కొత్త నిర్ణయం ప్రకారం ఇకపై ఈ కేటగిరీలోని టికెట్లపై కేవలం 5% GST మాత్రమే వసూలు చేస్తారు. దీనివల్ల ముఖ్యంగా సింగిల్ స్క్రీన్లు, చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సినిమాహాళ్లు పెద్ద ఊరట పొందనున్నాయి. ప్రేక్షకులు కూడా తక్కువ ధరకు సినిమా చూడగలుగుతారు. చిన్న సినిమాలు, మధ్యస్థాయి సినిమాలకు ఇది లాభదాయకం కానుంది.

మెట్రో మల్టీప్లెక్స్‌లలో పరిస్థితి ఏంటి?

అయితే రూ.100 పైబడిన టికెట్లపై మాత్రం ఎలాంటి తగ్గింపు లేదు. ఇప్పటివరకు ఉన్నట్లే 18% GST కొనసాగనుంది. హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు, ముంబయి వంటి మెట్రో నగరాల్లో మల్టీప్లెక్స్‌లలో సినిమా చూడడానికి వెళ్లే ప్రేక్షకులకు పెద్దగా మార్పు ఉండదు. అంటే, పెద్ద సినిమాలు, స్టార్ హీరోల సినిమాలు చూడడానికి వెళ్ళే ప్రేక్షకులు మాత్రం అదే ధర చెల్లించాల్సి ఉంటుంది.

మల్టీప్లెక్స్‌ల డిమాండ్ నెరవేరిందా?

మల్టీప్లెక్స్‌ యజమానులు టికెట్ ధర రూ.300 వరకు ఉన్న వాటిని కూడా 5% GST కేటగిరీలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. అలా చేస్తే ఎక్కువమంది ప్రేక్షకులు థియేటర్లకు తిరిగి వస్తారని, కలెక్షన్లు పెరుగుతాయని వారి వాదన. కానీ ఈ ప్రతిపాదనను ప్రభుత్వం అంగీకరించలేదు.

తగ్గనున్న పాప్ కార్న్ రేట్లు..

మరోవైపు థియేటర్లలో అమ్మే పాప్ కార్న్ పైన కూడా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం.. పాప్ కార్న్ రెండు రకాల శ్లాబుల పరిధిలోకి రానుంది. సాల్టెడ్ పాప్ కార్న్ 5% శ్లాబ్ లోకి రాగా, పంచదార మిక్స్ చేసిన క్యారమెల్ పాప్ కార్న్ 18% శ్లాబ్ లోకి చేరింది. దీంతో మల్టీప్లెక్స్‌లలో కూడా ప్రేక్షకులు సినిమా చూసేందుకు ఆసక్తికనబరచొచ్చు అని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎందుకంటే, ఇదివరకు సినిమా టికెట్ రేట్ కంటే, పాప్ కార్న్ రేట్ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు పాప్ కార్న్ రేట్లు కూడా తగ్గనుండటంతో సినీ ప్రియులు థియేటర్లకు వచ్చేందుకు వెనుకాడకపోవచ్చు.

ఇండస్ట్రీపై ప్రభావం..

చిన్న సినిమాలకు ఇది ఒక శుభవార్తే. టికెట్ ధర తగ్గడంతో మరింతమంది ప్రేక్షకులు చిన్న హాళ్లలోకి వచ్చే అవకాశం ఉంది. పెద్ద సినిమాలు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అందరూ వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయంతో చిన్న సినిమాలకు ఇది బూస్ట్ అవుతుంది. కానీ మల్టీప్లెక్సుల్లో కూడా తగ్గింపు ఇచ్చి ఉంటే బాగుండేది” అని సినీ ప్రేమికులు అంటున్నారు.

చివరిగా..

కొత్త GST రేట్లు సినిమా పరిశ్రమకు మేలు చేకూర్చేదిగా ఉన్నాయి. చిన్న సినిమాలకు ఇవి బాగా ఉపయోగపడతాయి. కానీ పెద్ద సినిమాలు, మల్టీప్లెక్సులు మాత్రం ఎటువంటి ఊరట పొందలేకపోయాయి. మొత్తానికి, ఈ మార్పులు సినిమా టికెట్ మార్కెట్‌ను ఏ మేరకు ప్రభావితం చేస్తాయో రాబోయే నెలల్లో తెలుస్తుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.