గత ఏడాది దీపావళికి క తో వచ్చి కెరీర్ లో బిగెస్ట్ హిట్ కొట్టిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఈదీపావళికి కె -ర్యాంప్ తో వస్తున్నాడు.రీసెంట్ గా ఈసినిమా నుండి గ్లింప్స్ , ఫస్ట్ సాంగ్ రిలీజ్ కాగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.ఇక నెక్స్ట్ సెకండ్ సింగిల్ రానుంది.కలలే కలలే అంటూ సాగే ఈపాటను ఈనెల 9న రిలీజ్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా కొత్త దర్శకుడు జైన్స్ నాని ఈసినిమాను తెరకెక్కిస్తుండగా యుక్తి థరేజా హీరోయిన్ గా నటిస్తుంది.చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు.హాస్య మూవీస్ బ్యానర్ పై రాకేష్ దండా నిర్మిస్తున్నారు.అక్టోబర్ 18న సినిమా థియేటర్లోకి తీసుకురానున్నారు.మరి మరోసారి కిరణ్ అబ్బవరంకు దీపావళి సెంటిమెంట్ కలిసొస్తుందో చూడాలి.
ఇక కిరణ్ ప్రస్తుతం ఈసినిమాతో పాటు చెన్నై లవ్ స్టోరీ అనే సినిమా కూడా చేస్తున్నాడు.నంబూరి రవి డైరెక్షన్ లో ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈసినిమాలో మ్యాడ్ ఫేమ్ శ్రీ గౌరీ హీరోయిన్ నటిస్తుండగా లెజండరీ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.బేబి డైరెక్టర్ సాయి రాజేష్ ఈసినిమాను నిర్మిస్తున్నాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























