‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ కోసం ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ముందే ఒక ప్రత్యేక గిఫ్ట్‌తో 20th సెంచరీ స్టూడియోస్ వచ్చింది. జేమ్స్ కామెరూన్ మాస్టర్‌పీస్ ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ ఈ ఏడాది అక్టోబర్ 2న భారతీయ థియేటర్స్‌లో ఒక వారం పాటు 3Dలో రీ-రిలీజ్ కానుంది. ఈ సినిమాలో సామ్ వర్తింగ్టన్, జోయి సాల్డానా ప్రధాన పాత్రల్లో నటించగా, సిగోర్నీ వీవర్, కేట్ విన్స్లెట్, స్టీఫెన్ లాంగ్ కూడా కీలక పాత్రల్లో కనిపించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
జేమ్స్ కామెరూన్ సృష్టించిన దృశ్య కావ్యాలలో ఒకటైన ఈ విజువల్ స్పెక్టాక్యులర్ మొదటిసారి 2022 డిసెంబర్లో విడుదలై సంచలనం సృష్టించింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు $2.32 బిలియన్ డాలర్లను వసూలు చేసింది. భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన హాలీవుడ్ చిత్రం అనే రికార్డుతో పాటు, ఆస్కార్ అవార్డు (బెస్ట్ అచీవ్మెంట్ ఇన్ విజువల్ ఎఫెక్ట్స్) కూడా గెలుచుకుంది.
అవతార్: ది వే ఆఫ్ వాటర్ మళ్లీ 3Dలో చూడటం ద్వారా, పాండోరా అద్భుతమైన అండర్‌వాటర్ లోకాలు, సల్లీ ఫ్యామిలీ హృదయానికి హత్తుకునే కథను పెద్ద తెరపై తిరిగి అనుభవించే అవకాశముంది. “ఈ అవకాశం మిస్ అవ్వకండి. మీరు ముందే ఈ మంత్ర ముగ్ధమైన లోకాన్ని చూసినా, లేదా మొదటిసారి చూడబోతున్నా – ఇది మర్చిపోలేని సినిమా అనుభవం అవుతుంది” అని 20th సెంచరీ స్టూడియోస్ ఇండియా ప్రతినిధులు తెలిపారు.
కాగా అవతార్ సిరీస్ లో మూడో సినిమాగా తెరకెక్కిన ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ త్వరలో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 19న ఈ విజువల్ వండర్ ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ నేపథ్యంలో మరోసారి ఆ లోకాన్ని ప్రేక్షకులకు గుర్తుచేసేందుకు ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ చిత్రాన్ని నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























