11వ శతాబ్దానికి చెందిన ప్రముఖ హిందూ వేదాంతవేత్త, గురువర్యులు శ్రీ రామానుజాచార్యుల సమానత్వ సందేశాన్ని చాటిచెబుతూ, ‘సమతామూర్తి విగ్రహం’ (Statue of Equality) హైదరాబాద్ నగర శివార్లలో ఆధ్యాత్మిక వెలుగును నింపుతోంది. ఈ దివ్యమైన ప్రదేశాన్ని దర్శకుడు పూరి జగన్నాథ్ మరియు నిర్మాత ఛార్మీ కౌర్ తాజాగా సందర్శించారు. ఈ సందర్భంగా వారు ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీశ్రీశ్రీ చినజీయర్ స్వామి వారి నుండి ఆశీర్వాదం అందుకున్నారు. ఇక ఈ అద్భుతమైన నిర్మాణాన్ని చూసి పూరి జగన్నాథ్ మరియు ఛార్మీ కౌర్ ఎంతగానో ముగ్ధులయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ విగ్రహం చినజీయర్ స్వామి వారి సంకల్పం, మరియు రామానుజాచార్యుల వారి ఆశీస్సులతో రూపొందిందని పూరి జగన్నాథ్ ప్రశంసించారు. ఈ సందర్శన తమకు ఒక ప్రత్యేక అనుభూతిని ఇచ్చిందని, రామానుజచార్యుల వారి సమతా సందేశం తమకు ప్రేరణ కలిగించిందని వారు తెలిపారు. ఇక ఈ సందర్శన ద్వారా, సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులు కూడా ఆధ్యాత్మిక, మరియు తాత్విక సందేశాలను ఆదరిస్తున్నారని స్పష్టమైంది.
కాగా ప్రపంచానికి సమతా సిద్ధాంతాన్ని నేర్పించిన గురువు.. కులమతాలకతీతంగా మనుషులంతా ఒక్కటేనని చాటిన ఐక్యతామూర్తి శ్రీ రామానుజాచార్యుల వారి 1000వ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహాన్ని ‘సమతామూర్తి’ పేరుతో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని ముచ్చింతల్ శ్రీరామనగరంలో 2022వ సంవత్సరం ఫిబ్రవరి 5న స్థాపించారు. ప్రధాని నరేంద్ర మోదీ వసంత పంచమి పర్వదినం సందర్భంగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించి జాతికి అంకితం ఇచ్చారు.
చినజీయర్ స్వామి వారి ఆధ్వర్యంలో 200 ఎకరాల్లో దాదాపు 1,000కోట్ల ఖర్చుతో 216 అడుగుల రామానుజాచార్య పంచలోహ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహావిష్కరణ ప్రతిష్ఠాపనలో భాగంగా 1035 హోమగుండాలతో ప్రత్యేక యాగ క్రతువు నిర్వహించారు. అలాగే సమతామూర్తి కేంద్రంలో 54 అడుగుల సమతామూర్తి 120 కిలోల స్వర్ణ ప్రతిమను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఫిబ్రవరి 13న ఆవిష్కరించారు. నాటినుంచి ఈ ఆశ్రమం కేవలం తెలంగాణకే కాకుండా యావత్ భారతావనికి సందర్శనీయ స్థలంగా మారింది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























