రాక్షసుడు తరువాత యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ – అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం కిష్కింధపురి.హారర్ థ్రిల్లర్ గా చావు కబురు చల్లగా ఫేమ్ కౌశిక్ పెగళ్లపాటి ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. ఇక ఈరోజు ట్రైలర్ ను రిలీజ్ చేశారు.ఈ ట్రైలర్ కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.థియేటర్లలో ఈ సినిమా బయపెట్టేలానే వుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా చాలా తక్కువ రన్ టైం తో థియేటర్లలోకి రానుంది.కేవలం 2గంటల 5 నిమిషాల నిడివితో థియేటర్లలోకి రానుందని డైరెక్టర్ కన్ ఫర్మ్ చేశాడు. చూసేటప్పుడు బాగుందో బాగోలేదు అనే డిసైడ్ అయ్యే లోపు సినిమా అయిపోతుందంటూ చెప్పుకొచ్చాడు.మరి ఇంత తక్కువ రన్ టైం సినిమాకు ప్లస్ అవుతుందో లేదో చూడాలి. ఇక ఈసినిమాకు సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ జారీ చేసిందని వార్తలు వస్తున్నాయి.అయితే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సివుంది.
సామ్ సీఎస్ ,చైతన్య భరద్వాజ్ ఈసినిమాకు సంగీతం అందిస్తుండగా షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు.సెప్టెంబర్ 12న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.ఇక ఈసినిమా తనకు కావాల్సిన విజయాన్ని ఇస్తుందని సాయి శ్రీనివాస్ కాన్ఫిడెంట్ గా వున్నాడు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























