12 ఏళ్ళ క్రితం ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సెన్సేషన్ సృష్టించింది మలయాళ సినిమా దృశ్యం.సూపర్ స్టార్ మోహన్ లాల్ ,దర్శకుడు జీతూ జోసఫ్ కాంబినేషన్ లో వచ్చిన ఈసినిమా క్రైం థ్రిల్లర్ డ్రామాల్లో బెంచ్ మార్క్ ను క్రియేట్ చేసింది.ఆ తరువాత ఈసినిమా తెలుగు , హిందీల్లో రీమేక్ అయ్యి సూపర్ హిట్ అయ్యాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాకు సీక్వెల్ గా వచ్చిన దృశ్యం 2 కూడా బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.అయితే కోవిడ్ వల్ల ఈసినిమా థియేటర్లలో రిలీజ్ అవ్వలేదు. ఇక ఈసిరీస్ లో థర్డ్ పార్ట్ కూడా రానుందని తెలిసిందే.రీసెంట్ గానే అఫీషియల్ గా అనౌన్స్ కూడా చేశారు.ప్రస్తుతం దృశ్యం 3 స్క్రిప్ట్ వర్క్ కూడా కంప్లీట్ కావడంతో సెట్స్ మీదకు వెళ్ళడానికి రెడీ అవుతుంది.ఈనెల రెండో వారం లేదా మూడో వారం షూటింగ్ ను మొదలు పెట్టనున్నారని సమాచారం.డిసెంబర్ లోపు షూటింగ్ కంప్లీట్ కానుంది.
ఇక మలయాళ వెర్షన్ చిత్రీకరణ పూర్తి కాగానే దృశ్యం 3 తెలుగు ,హిందీ లోకూడా తెరకెక్కనుంది. తెలుగులో వెంకటేష్ హీరోగా నటించనుండగా హిందీలో అజయ్ దేవగన్ చేయనున్నారు.వచ్చే ఏడాది మూడు భాషల్లో ఒకేసారి దృశ్యం 3 ని రిలీజ్ చేయనున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























