రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులందరికీ ఇప్పుడు ఒక సంతోషకరమైన వార్త. వారి అభిమాన హీరో నటిస్తున్న ‘స్పిరిట్’ సినిమా కోసం దేశంలోనే అత్యంత ప్రతిభావంతుడైన, ఫేమస్ హెయిర్ స్టైలిస్ట్ అయిన ఆలిమ్ హకీం రంగంలోకి దిగారు. ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ లాంటి సంచలనాత్మక చిత్రాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు ప్రభాస్ లుక్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆలిమ్ హకీం ఎందుకంత స్పెషల్?
ఆలిమ్ హకీం కేవలం ఒక హెయిర్ స్టైలిస్ట్ మాత్రమే కాదు. ఆయన పని చేసే ప్రతీ హీరోకు ఒక కొత్త మేకోవర్ ఇస్తారు. పెద్ది సినిమాలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లుక్స్ ని కూడా హకీం యే డిజైన్ చేస్తుండటం గమనార్హం. ఇప్పుడు సందీప్ వంగా మరియు ఆలిమ్ హకీం కాంబినేషన్లో రాబోతున్న ‘స్పిరిట్’ సినిమాలోని లుక్ ఊహించుకుంటేనే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి.
మొదటిసారి పోలీస్ పాత్రలో..
‘స్పిరిట్’ సినిమాతో ప్రభాస్ తన కెరీర్ లో మొదటిసారి ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్రకు ఆలిమ్ హకీం ఎలాంటి లుక్ ఇస్తారోనని అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ గడ్డం, హెయిర్ స్టైల్, మరియు బాడీ లాంగ్వేజ్ అన్నింటిలోనూ కొత్తదనం ఉంటుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కోసం ప్రభాస్ చాలా స్లిమ్‌గా, ఫిట్‌గా మారనున్నారని సమాచారం.
అధికారిక ప్రకటన ఇంకా రాలేదు కానీ, ఈ వార్తతోనే అభిమానుల్లో ఉత్సాహం పెరిగింది. ఈ లుక్ కోసం ప్రొడక్షన్ టీం మరియు ఆలిమ్ హకీం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని, ప్రభాస్ ఫ్యాన్స్ కోసం ఒక విజువల్ ట్రీట్ సిద్ధం చేస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ అంచనాలను నిజం చేస్తూ, ‘స్పిరిట్’ సినిమా ప్రభాస్ కెరీర్లోనే ఒక మైలురాయిగా నిలవడం ఖాయమని అభిమానులు ధీమాగా ఉన్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























