ప్రైడ్ ఆఫ్ ఇండియన్ మూవీస్ బాహుబలి 1& 2 రీ రిలీజ్ కానున్నాయని తెలిసిందే. రెండు పార్ట్ లు కలిపి సింగిల్ పార్ట్ గా విడుదలచేయనున్నారు. బాహుబలి ది ఎపిక్ అనే టైటిల్ తో అక్టోబర్ 31న రీ రిలీజ్ కానుంది.అందులో భాగంగా ఈరోజు ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ అదిరిపోయింది.హై క్వాలిటీతో కూడిన విజువల్స్ ఆకట్టుకున్నాయి.టీజర్ చూస్తుంటే థియేటర్లలో బాహుబలి ది ఎపిక్ విజువల్ వండర్ అనిపించడం ఖాయం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా రన్ టైం మూడున్నర గంటలు వుండనుందని సమాచారం.సాంగ్స్ కట్ చేయనున్నారు. ఇక ప్రస్తుతం రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తుడడంతో బాహుబలి ది ఎపిక్ రీ రిలీజ్ కలెక్షన్ల విషయంలో రికార్డులను తిరగరాయనుంది. దాదాపు ఈసినిమా 50 కోట్ల వరకు రాబట్టే ఛాన్స్ లేకేపోలేదు.
ఇక సరిగ్గా 10 ఏళ్ళ క్రితం థియేటర్లలోకి వచ్చిన బాహుబలి 1 ఇండియన్ సినిమా స్థాయిని మార్చేసింది.ఈసినిమా దాదాపు 650 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టి చరిత్ర సృష్టించింది. ఈసినిమా సీక్వెల్ కోసం దేశమంతా ఎదురుచూసింది.
ఇక 2017లో వచ్చిన సీక్వెల్ బాహుబలి 2 సృష్టించిన విధ్వసం అంతా ఇంత కాదు.ఇప్పటికీ ఈసినిమా పేరిట వున్న రికార్డులను ఏ సినిమా కూడా చెరిపేయలేక పోయింది.అగ్ర దర్శకుడు రాజమౌళి ఈసినిమాలను డైరెక్ట్ చేయగా రెబల్ స్టార్ ప్రభాస్ ,రానా ,అనుష్క , రమ్యకృష్ణ ,నాజర్ తదితరులు నటించారు.కీరవాణి సంగీతం అందించగా భారీ బడ్జెట్ తో ఆర్కా మీడియా నిర్మించింది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























