మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇండస్ట్రీ హిట్ జైలర్ కు సీక్వెల్ గా వస్తున్న సినిమా జైలర్ 2.రెండేళ్ల క్రితం సూపర్ స్టార్ రజినీకాంత్ – డైరెక్టర్ నెల్సన్ కాంబినేషన్ లో వచ్చిన జైలర్ 600 కోట్లకు పైగా వసూళ్లతో ఇండస్ట్రీ హిట్ గా రికార్డు సృష్టించింది.తెలుగులో కూడా ఈసినిమా బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.ఇక ఇప్పుడు ఈసినిమాకు ఇప్పుడు సీక్వెల్ గా జైలర్ 2 తెరకెక్కుతుంది.ఈ సీక్వెల్ పై భారీ అంచనాలు వున్నాయి. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
అందులో భాగంగా ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ లో రజనీకాంత్ ,ఎస్ జె సూర్య పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇక ఈసినిమా ఫైనల్ షెడ్యూల్ గోవా లో జరుగనుంది. ఇందుకోసం భారీ సెట్ వేస్తున్నారు.ఇందులో క్లైమ్యాక్స్ షూట్ చేయనున్నారు. నవంబర్ లో ఈ షెడ్యూల్ జరుగనుంది. దాంతో షూట్ కంప్లీట్ కానుంది. 2026 సమ్మర్ లో ఈసినిమా థియేటర్లలోకి రానుంది.
అనిరుధ్ ఈసినిమాకు సంగీతం అందిస్తుండగా సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది. ఇక ఈసినిమా కోలీవుడ్ కు మొదటి 1000 కోట్ల సినిమా అవుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.మరి జైలర్ 2 ఆ ఫీట్ సాధిస్తుందో చూడాలి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























