రాఘవ లారెన్స్ హీరోగా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో తెరకెక్కుతున్న చిత్రం బెంఙ్. రెమో ఫేమ్ భాగ్యరాజ్ కణ్ణన్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా యంగ్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు.మోస్ట్ వైలెంట్ మూవీగా రూపొందుతున్న ఈసినిమాలో మలయాళ నటుడు నివిన్ పౌలి విలన్ గా నటిస్తున్నాడు.ఇందులో తను వాల్టర్ గా కనిపించనున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రీసెంట్ గా తన పాత్రకు సంబంధించిన గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేశారు. ఇక ఈసినిమాలో మరో హీరో జాయిన్ అయ్యాడు.తమిళ స్టార్ జయం రవి బెంజ్ లో మరో హీరోగా నటించనున్నాడు సమాచారం.ఈ విషయాన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.ఇక జయం రవి, శివ కార్తికేయన్ పరాశక్తి లో విలన్ గా నటిస్తున్నాడు. సుధా కొంగర ఈసినిమాను డైరెక్ట్ చేస్తుంది. ఇక ఇప్పుడు జయం రవి బెంజ్ లో నటించడానికి కూడా ఓకే చెప్పాడు.
టాప్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ సొంత నిర్మాణ సంస్థ జీ స్క్వాడ్ అనే బ్యానర్ లో జగదీష్ ,సుధాన్ సుందరం తో కలిసి లోకేష్ ఈసినిమాను నిర్మిస్తున్నాడు.నిర్మాత గా లోకేష్ కు ఇదే మొదటి సినిమా.షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది.ఈఏడాది చివర్లో ఈసినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























