యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చాలా గ్యాప్ తరువాత సోలో హీరోగా కిష్కింధపురితో రానున్నాడు.సెప్టెంబర్ 12 న విడుదలకానుంది. అందులో భాగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకుంటుంది.ప్రస్తుతం సాయి శ్రీనివాస్ ఈసినిమా డబ్బింగ్ కంప్లీట్ చేస్తున్నాడు.రీసెంట్ గా టీజర్ రిలీజై సినిమాపై అంచనాలను పెంచేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో శ్రీనివాస్ కి జంటగా అనుపమా పరమేశ్వరన్ నటించింది.ఇంతకుముందు వీరి కాంబోలో వచ్చిన రాక్షసుడు సూపర్ హిట్ అనిపించుకోగా ఇక ఇప్పుడు ఈ పెయిర్ కిష్కింధపురి తో రానున్నారు.చావు కబురు చల్లగా ఫేమ్ కౌశిక్ పెగళ్లపాటి ఈసినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. సామ్ సీఎస్ ,చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ఈసినిమాతో హిట్ కొట్టి ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు సాయి శ్రీనివాస్.త్వరలోనే ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.
ఇక సాయి శ్రీనివాస్ ప్రస్తుతం టైసన్ నాయుడు ,హైందవ సినిమాలు కూడా చేస్తున్నాడు .టైసన్ నాయుడుని భీమ్లా నాయక్ ఫేమ్ సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేస్తున్నాడు. ఎప్పటినుండో షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమాను 14 రీల్స్ ప్లస్ నిర్మిస్తుంది.అలాగే హైందవ ను లుధిర్ బైరెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు.ఈసినిమా డిఫ్రెంట్ జోనర్ లో రూపొందుతుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























